Kishan Reddy: విమోచన దినోత్సవం జరపకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారు: కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. అనంతరం G-20 సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెళ్లారు.

New Update
Kishan Reddy: విమోచన దినోత్సవం జరపకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారు: కిషన్‌రెడ్డి

Kishan Reddy Press Meet

ప్రజల దృష్టిని మళ్లించేందుకు..

సీఎం కేసీఆర్‌ (CM KCR) విమోచన దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవం జరపాలని గతంలో కాంగ్రెస్‌ను నిలదీసిన కేసీఆర్.. నేడు ఎందుకు విమోచన దినోత్సవం (Telangana Liberation Day) వేడుకలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఅర్ఎస్ (BRS) ప్రయత్నం చేస్తోందన్నారు. ఆ రోజు రాజకీయ సభలకు ప్లాన్ చేసింది. అమిత్ షా (Amit Shah) పాల్గొనే కార్యక్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నం బీఅర్ఎస్, కాంగ్రెస్ చేస్తోందన్నారు.

విమోచన దినోత్సవ వేడుకలను పక్కదారి

సెప్టెంబరు 17 సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయిని తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం మన్నారు. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతోందన్నారు. మీరు మీటింగులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు.. కానీ అదే రోజు ఎందుకు పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ మజ్లిస్‌ తో కుమ్మకై విమోచన దినోత్సవ వేడుకలను పక్కదారి పట్టిస్తున్నాయని కేంద్రమంత్రి విమర్శలు చేశారు. గత ఏడాది కేంద్ర అధీనంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు రాకుండా డుమ్మా కొట్టిన కేసీఆర్..ఈ ఏడాది కూడా కేసీఆర్‌కు విమోచన దినోత్సవం వేడుకలకు ఆహ్వానం పంపిస్తాం అన్నారు. సీఎం విమోచన దినోత్సవం వేడుకకు రావాలన్నారు.

మెడికల్ కాలేజీ పేరుతో..

బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ దేశానికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వలే తెలంగాణకు విమోచన దినోత్సవం అంతే ముఖ్యం అన్నారు. అసదుద్దీన్ ఎక్కడ అలుగుతాడు అనే విమోచన దినోత్సవం కాంగ్రెస్, బీఅర్ఎస్ జరపటం లేదు.కాంగ్రెస్ మీటింగ్ మరే ఏ తేదీలో అయిన జరపవచ్చు. అదే రోజు జరపాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలో ప్రారంభోత్సవం పేరుతో రాజకీయ సభకు సీఎం కేసీఆర్ తెరలేపని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు.

Also Read: కేసీఆర్‌పై తమిళిసై సంచలన వ్యాఖ్యలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు