telugu girl died in USA:అమెరికాలో తెలుగు అమ్మాయిని మింగేసిన రాకాసి అల

అమెరికాలో వాషింగ్టన్ స్టేట్ లో హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి శ్వేత చిరుమామిళ్ళ మృతి చెందారు. అక్కడి రియాల్టో బీచ్ లో సరదాగ గడపడానికి వెళ్ళిన శ్వేతను రాకాసి అల పొట్టనపెట్టుకుంది.

New Update
telugu girl died in USA:అమెరికాలో తెలుగు అమ్మాయిని మింగేసిన రాకాసి అల

అమెరికాలో తెలగు అమ్మాయి గల్లంతయింది. వాషింగ్టన్ స్టేట్ లో ఉంటున్న శ్వేత చిరుమామిళ్ళ సముద్రపు అలకు బలి అయింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకోవలసి వచ్చింది. ఒలింపిక్ నార్త్ వెస్ట్ పెనిసులాలో ఉన్న రియాల్టో బీచ్ కు శ్వేత తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వెళ్ళింది. అక్కడ సముద్రంలో ఆడుకుంటుండగా ఒక పెద్ద రాకాసి అల వచ్చి వారందరినీ ముంచేసింది. అక్కడితో ఆగకుండా శ్వేతను తనతో పాటూ తీసుకుని వెళ్ళిపోయింది కూడా. శ్వేత చిరుమామిళ్ళ వయసు 26. హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి.

swetha, usa

శ్వేత గురించి తమకు సమాచారం సెప్టెంబర్ 25 సోమవారం ఉదయం 10.50కి అందింది అని చెబుతున్నారు యూఎస్ కోస్ట్ గార్డ్స్. తర్వాత అక్కడి నుంచి ఆమె కోసం సముద్రంలో 5 గంటల పాటూ వెతికారు. హెలికాఫ్టర్లు, ల్యాండ్ సెర్చ్ కూడా చేశారు. కానీ శ్వేత ఆచూకీ మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఆమె మతదేహాన్ని గుర్తించగలిగారు. సెర్చ్ ఆపరేషన్ చాలా కష్టమైందని... బుధవారమంతా వెదర్ కండిషన్స్ అస్సలు బాగోలేదని చెబుతున్నారు కోస్ట్ గార్డ్స్.

అమెరికాలో శ్వేత సియాటెల్ లో ఉంటుందో అని తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తోంది, ఏం చదువుతోంది... అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ లో శ్వేత తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ ఉంటారు అన్న వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు