Ap And Tg Rain Update: ఏపీ, తెలంగాణలో ఎండలకు బ్రేక్.. వర్షాలకు వెల్‌కమ్-ఎక్కువగా ఈ జిల్లాల్లోనే!

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మార్చి 21, 22 తేదీల్లో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో.. అలాగే ఏపీలో 22, 23 తేదీల్లో ఉత్తరాంధ్ర,దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడనున్నాయి.

New Update
Weather Department Big Alert andhra pradesh and telangana Rains

Weather Department Big Alert andhra pradesh and telangana Rains

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అర్జెంట్ పని ఉన్నా.. అమ్మో ఎండ అంటూ వెనక్కి తగ్గుతున్నారు. ఇంట్లో ఉండి ఉక్కపోతకు గురై చెమటలు కక్కుతున్నారు. వేసవి వచ్చిందంటే ప్రజల పరిస్థితి ‘ముందుకెళ్తె నుయ్యి.. వెనక్కి వెళ్తే గొయ్యి’ అన్నట్లు ఉంటుంది. 

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

బయటకు వెళ్తే ఎండలు.. పోనీ ఇంట్లో ఉందామా అంటే ఉక్కపోత.. ఇలా ప్రజలు మగ్గిపోతున్నారు. మరి అలాంటి సమయంలో చల్ల చల్లని గాలితో ఫ్రిడ్జ్‌లోంచి అప్పుడే తీసిన కూలింగ్ వాటర్‌లా వర్షం పడితే ఎలా ఉంటుంది. దాన్ని ఊహించుకుంటేనే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది కదూ.  అయితే ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేసే సమయం వచ్చేసింది. 

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

తెలంగాణలో వర్ష సూచన

వేసవి కాలంలో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల అంటే మార్చి 21, 22 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు సమాచారం. అందులో ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

ఇదే విషయంపై IMDలోని వాతావరణ శాస్త్రవేత్త KS శ్రీధర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘మార్చి 20 నుండి మేఘాలు ఏర్పడతాయి. దీనివల్ల తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి’’ అని ఆయన తెలిపారు.  మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ముందు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల సహా అనేక జిల్లాలు 40-41 డిగ్రీల సెల్సియస్ మధ్య తీవ్ర ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటాయని సమాచారం.

ఏపీలో వర్ష సూచన

అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వారు తెలిపారు. మార్చి 22, 23 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. దీంతో వర్షపాతం సమీపిస్తున్న కొద్దీ వేడిగాలులు బలహీనపడతాయి.

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

అందువల్ల ఉరుములు, ఈదురుగాలులు వీస్తున్నందున.. భారీ వర్షం సమయంలో ఇంటి లోపల ఉండటం, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని IMD ప్రజలకు సూచించింది. ఈ వర్షాలు పడేవరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని చెబుతున్నారు. అయితే మార్చి 25 తర్వాత వేడిగాలుల పరిస్థితులు తిరిగి దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు