TG Rains: నారాయణపేటలో విషాదం.. గోడ కూలి తల్లికూతుళ్లు మృతి
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమమ్మ(78), అంజిలమ్మ (35)గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.