/rtv/media/media_files/2026/06/08/telangana-jobs-2026-06-08-15-57-49.jpg)
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఒక మంచి తీపి కబురు చెప్పబోతోంది. రాష్ట్రంలో కొత్తగా 5 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
మొత్తం 4,500 కానిస్టేబుల్ పోస్టులు
ఈ 5 వేల ఉద్యోగాలలో స్పెషల్ పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కలిపి మొత్తం 4,500 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 500 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల నియమాకానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి త్వరలోనే అధికారిక అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
నిజానికి ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 17 వేల ఖాళీలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటన్నింటినీ ఒకేసారి కాకుండా.. మొదటి విడత కింద 5 వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనలు చేస్తుండటంతో అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో కోచింగ్ తీసుకుంటూ, ప్రిపేర్ అవుతున్న యువత ఈ నోటిఫికేషన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక దీనికి సంబంధించిన విద్యార్హతలు, వయస్సు పరిమితి, పరీక్షలు ఎలా జరగుతాయి, ఎంపిక విధానం ఏంటి అనే పూర్తి వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.
Follow Us