TS: హైదరాబాద్ తరహాలో వరంగల్–సీం రేవంత్ రెడ్డి

వరంగల్‌ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నడుంబిగించారు. దీంట్లో భాగంగా ఇక్కడ విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి మంత్రులూ, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు ఉండాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 
వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని  రేవంత్ సూచించారు. వ‌రంగ‌ల్ (మామూనూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు విమానాశ్ర‌యాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌ని..ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌ని ముఖ్య‌మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. కొచ్చి విమానాశ్ర‌యం అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని.. దానిని ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు సూచించారు. వ‌రంగ‌ల్ అవుట‌ర్ రింగు రోడ్డు, రేడియ‌ల్ రోడ్లు విమానాశ్ర‌యానికి అనుసంధానంగా ఉండాల‌ని చెప్పారు. 

Also Read: అమెజాన్ కొత్త సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే ఆఫర్లు!

Also Read: పట్టపగలే యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి పొడిచి! (వీడియో వైరల్)

విమానాశ్రయాలతో తెలంగాణ అభివృద్ధి...

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాతో పాటు ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాల ప్ర‌జ‌లు భ‌విష్య‌త్‌లో వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం నుంచే రాక‌పోక‌లకు వీలుగా ర‌హ‌దారులు నిర్మించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెక్స్‌టైల్స్‌తో పాటు ఐటీ, ఫార్మా, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధితో హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ ఎదిగేలా ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని సూచించారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం పూర్త‌యితే మేడారం జాత‌ర‌తో పాటు ల‌క్న‌వ‌రం, రామ‌ప్ప ఇత‌ర ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు సైతం దానినే వినియోగించుకుంటార‌ని సీఎం తెలిపారు. ఈ సమీక్సా సమావేశంలో  మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కొండా సురేఖ‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే కె.జ‌య్‌వీర్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు,ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద‌, వ‌రంగ‌ల్ ఆర్డీవో స‌త్య పాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read: Afghan: భారత్‌తో బలమైన సంబంధాలు కావాలి‌‌–ఆఫ్ఘాన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హైదరాబాద్‌లో ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోని ప్రీమియా మాల్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు పోటీలు జరుగుతాయి.

New Update
ice cream

ice cream

ఐస్‌క్రీమ్ ప్రియులకు ఒక ప్రత్యేకమైన పోటీ వేదిక రాబోతుంది. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ రకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తిస్తే చాలు.. ఏకంగా రూ. 3 లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం మీ కోసం రెడీ అవుతుంది. ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ మూడవ ఎడిషన్ ఈ నెల 27న ఐస్‌క్రీమ్ అభిమానుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను  ఎర్రమంజిల్‌లోని గలేరియా మాల్‌లో ప్రముఖ హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌, బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతావర్మ,  నటుడు సమీర్‌లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పోటీ  పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ ఆసక్తికరమైన పోటీలో విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేయనున్నారు.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండవ బహుమతిగా రూ. 50 వేలు,  మూడవ బహుమతిగా రూ. 25 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. మరో 25 మంది విజేతలను ఎంపిక చేసి, ఒక్కొ విజేతకు రూ. 5 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు కూడా నిర్వాహకులు ఇవ్వనున్నారు.

 ఈ పోటీలు ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్‌లో ఈ నెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తారలు స్వయంగా కళ్లకు గంతలు కట్టుకుని వివిధ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తించే ప్రయత్నం చేశారు.. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం 8008574747 నెంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐస్‌బర్గ్‌ ఐస్‌క్రీమ్స్ సీఈఓ సుహాస్‌ బి. శెట్టి, ఒక ప్రముఖ తెలుగు ఛానెల్ ఎండీ ఎం. రాజ్‌గోపాల్ , డాక్టర్ జె. సంధ్యారాణి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోటీ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. ఐస్‌క్రీమ్ రుచులను గుర్తించడంలో మీ నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ప్రత్యేకమైన వేదికగా కూడా నిలవనుంది. 

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

hyderabad | ice-cream | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment