/rtv/media/media_files/2026/05/11/vijayalaxmi-appointed-as-women-commission-chairman-and-kasoju-shankaramma-appointed-as-member-2026-05-11-18-48-10.jpg)
vijayalaxmi appointed as women commission chairman and Kasoju shankaramma appointed as Member
Telangana Women Commission: తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్‌లో మరో కీలక సభ్యురాలిగా తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు అవకాశం వచ్చింది. సామాజిక సమీకరణాలు, ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్లకి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ పదవీకాలం అయిదేళ్ల పాటు కొనసాగనుంది.
Also Read: నోరు జారిందా..? కావాలనే అన్నాడా? కమెడియన్ సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!
2014 అసెంబ్లీ ఎన్నికల్లో శంకరమ్మను బీఆర్ఎస్ పార్టీ (అప్పుడు TRS) హుజుర్‌నగర్ నుంచి బరిలోకి దింపింది. కానీ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకుంది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
Follow Us