గురుకులాల్లో మళ్లీ ఖాళీలు.. ఈసారి ఎంతంటే ? తెలంగాణలోని గురుకులాల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడ్డాయి. డీఎస్సీ ఫలితాలతో మరిన్ని పోస్టుల్లో ఖాళీలయ్యాయి. సరైన రూల్స్ వర్తించకపోవడం, ఇతర పోస్టులకు అర్హత సాధించడమే దీనికి ప్రధానకారమని తెలుస్తోంది. By B Aravind 27 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలోని గురుకులాల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల్లో ఇప్పటికే భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడ్డాయి. అయితే తాజాగా వచ్చిన డీఎస్సీ ఫలితాలతో మరిన్ని పోస్టుల్లో ఖాళీలు ఏర్పడుతున్నాయి. గురుకులాల పనివేళలు, ఉద్యోగులకు ఇతర సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ఏవీ వర్తించకపోవడం లాంటి కారణాల వల్లే ఇలా ఖాళీలు ఏర్పడుతున్నాయని సొసైటీ ఉద్యోగులు తెలుపుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గత ఏడాది ఆగస్టులోనే రాత పరీక్ష జరిగింది. Also Read: తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్ పర్యటనలు ఖాళీగా 2500 పోస్టులు ఆ తర్వాత కోర్టు కేసుల నేపథ్యంలో మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు తప్పా మిగతా పోస్టుల భర్తీని కూడా చేపట్టింది. 8,708 పోస్టులకు 1:2 ఎంపిక చేసింది. ఇక మరికొన్ని కేటగిరీల్లో అర్హులు లేరని 404 పోస్టులు కూడా భర్తీ చేయలేదు. మొత్తంగా 8,304 పోస్టులకు చివరి లిస్ట్‌ను ప్రకటించి ఆర్డర్లు ఇచ్చింది. వాళ్లలో దాదాపు 2 వేల మంది అభ్యర్థులు ఇప్పటికీ కూడా జాయిన్ కాలేదని సమాచారం. ఆయా అభ్యర్థులు జాయిన్ అయ్యేందుకు మరో నెలరోజుల పాటు గడువు ఉన్నా కూడా ఇప్పటికే మొత్తంగా 2500 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. మరో విషయం ఏంటంటే గురుకుల పోస్టుల రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో చాలామంది డీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు ఇటీవల వివిధ సొసైటీల నుంచి 'నో అబ్జక్షన్ సర్టిఫికేట్' కోసం భారీగా అప్లై చేసుకున్నారు. ఇలా ఎన్‌వోసీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అన్ని సొసైటీల్లో కలిపి 1000 మందికిపైగా అభ్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గురుకులాల్లో పోస్టులు మళ్లీ ఖాళీ అయ్యే దుస్థితి వచ్చింది. Also Read: నాలుగు గంటల్లోనే శంషాబాద్ నుంచి విశాఖ..సెమీ హైస్పీడ్ ట్రైన్ గతంలో టీజీపీఎస్సీ నిర్వహించిన 1,302 జేఎల్ పోస్టుల రాత పరీక్షలకు సంబంధించి ఇటీవలే 1:2 జాబితాలను విడుదల చేశారు. గురుకుల పోస్టులకు ఎంపికైన వారిలోనే చాలామంది అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు జేఎల్ పోస్టులు సాధించారు. దీంతో గురుకులాల్లో నియామకమైన పోస్టుల్లో ఎక్కువ పోస్టులు ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది. గురుకులాల్లో పోస్టింగ్ సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత అనేక మంది వదులుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం గురుకులాల్లోని పనివేళలు, ఇతర సర్వీస్ రూల్సే కారణమని తెలుస్తోంది. #telugu-news #telangana #gurukula మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి