/rtv/media/media_files/2024/12/25/ObxRoAQLqTyix47nLSNg.jpg)
TTD Chairman BR Naidu
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి 24వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయించనున్నట్లు తెలిపింది. సోమ, మంగళవారాల్లో తెలంగాణ నుంచి వచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నారు. బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయింపు ఉంటుంది. ప్రజాప్రతినిధి ఒకరికి ఒక రోజుకు ఒక సిఫారసు లేఖకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక్కో లేఖపై ఆరుగురికి మించకుండా టీటీడీ దర్శనం కేటాయించనుంది.
ఇది కూడా చదవండి: Teenmar Mallanna: కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త
— B R Naidu (@BollineniRNaidu) March 17, 2025
మార్చి 24వ తేదీ నుండి తెలంగాణా సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయింపు
గత ప్రభుత్వ హాయంలో తెలంగాణా వాళ్లను పట్టించుకోని అప్పటి టీటీడీ పాలకులు, అధికారులు
తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు గారి…
ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. దానికి బదులుగా శనివారం నాడు ఆదివారం దర్శనం కొరకు లేఖలు స్వీకరించనున్నట్లు టీటీడీ తెలిపింది. సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని భక్తులను టీటీడీ కోరింది.
ఇది కూడా చదవండి: CM Revanth: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
తమ సిఫారసు లేఖలను అనుమతించాలని గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు టీటీడీని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. స్పందించిన చంద్రబాబు తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను అనుమతించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది జరిగి రెండు నెలలు దాటినా టీటీడీ సీఎం నిర్ణయాన్ని అమలు చేయలేదు. దీంతో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు మరో లేఖ రాశారు.
రఘునందన్ రావు సీరియస్..
రెండ్రోజుల క్రితం తిరుమల స్వామివారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించి దర్శనాలను కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అనుమతించకపోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. సమ్మర్ హాలీడేస్ లో తప్పకుండా సిఫారసు లేఖలను పంపిస్తామని.. అనుమతించకపోతే తెలంగాణ ప్రజా ప్రతినిధులందరి తిరుమలకు వస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీటీడీ తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. దీంతో ఈ వివాదం ముగిసింది.