Ap Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా.. విలవిల్లాడుతున్న 17 మంది ప్రాణాలు!

ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

New Update
Travels bus overturns on Sullurpet Highway in Tirupati, AP

Travels bus overturns on Sullurpet Highway in Tirupati, AP

దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డంక అండ్ డ్రైవ్, ఓవర్ టేక్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రయాణికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు విడుస్తున్నారు. తరచూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ ఘటనలు చేసుచేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. వీటిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. 

ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

ఇంకా అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే కుంభమేళా సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎన్నో బస్సులు బోల్తా పడ్డాయి. మరెన్నో వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. ఎందరో మరణించారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో జరిగింది.

ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. 

Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..

తెలంగాణలో ట్రావెల్స్ బస్సు దగ్ధం

ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనే మరోకటి తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలో ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది. బస్సు టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కన నిలిపివేశాడు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.

New Update
anvesh sensational comments on bigg boss contestants

anvesh sensational comments on bigg boss contestants

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.  

ఉగ్రదాడికి వీరే కారణం

అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. 

అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment