/rtv/media/media_files/2025/04/06/xnXOkdEdqmkppEZ9Ak7Z.jpg)
Bandi Sanjay and Mahesh Kumar Goud
తెలంగాణలో సన్నబియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సన్నబియ్యం ఇస్తే దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బండి సంజయ్‌కు రోజురోజుకు అభద్రతా భావం పెరుగుతోందని అన్నారు. కాంగ్రెస్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు
'' సొంత పార్టీలోనే గుర్తింపు పొందేందుకు, రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్ ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన అభివృద్ధి ఆయనకు కనిపించకపోవడం విడ్డూరమే. ముఖ్యమంత్రి రేవంత్‌కు పాలన పట్ల పట్టు ఉండటం వల్లే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం వచ్చింది. హెచ్‌సీయూ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ HCUపై మాట్లాడటం సరికాదని'' మహేశ్ కుమార్ అన్నారు.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు.
thin-rice | telugu-news | telangana | cm revanth | mahesh kumar goud