శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్.. కంపుకొడుతున్న తెలుగు ఇండస్ట్రీ!

శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్ కేసులతో తెలుగు ఇండస్ట్రీ కంపుకొడుతోంది. ఒకవైపు డ్రగ్స్ ఎపిసోడ్ కొనసాగుతుంటే మరోవైపు రాజ్ తరుణ్‌, జానీ మాస్టర్, హర్షసాయి వంటి వారిపై లైంగిక ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇండస్ట్రీ పెద్దలు అంతా బాగానే ఉందని బుకాయిస్తే మాత్రం పచ్చి అబద్ధమే.  

New Update
drerr

Tollywood: న్యూడ్‌ వీడియోలు తీశాడు.. ఫొటోలూ సేవ్‌ చేసుకున్నాడు.. తర్వాత బ్లాక్‌మెయిల్‌ చేయడం స్టార్ట్ చేశాడు.. అవసరానికి వాడుకున్నాడు.. తర్వాత ముఖం చాటేశాడు.. ఇది యూట్యూబర్‌ హర్షసాయి గురించి ఫైల్ అయిన పోలీస్‌ కంప్లైంట్‌లో బాధితురాలి మాటలు! ఇందులో నిజనిజాల సంగతి కోర్టులు చూసుకుంటాయి. అయితే ఇటివలీకాలంలో ఈ తరహా ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోతోంది. రాజ్‌తరుణ్‌ నన్ను మోసం చేసి వదిలేశాడని లావణ్య పోలీసు స్టేషన్‌ గడపతొక్కగా.. నిన్నగాక మొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ తరహా కేసులో కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ ఇరుక్కున్నాడు.. ఇప్పుడేమో హర్షసాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరిపై ఒకే తరహా కేసులు నమోదవుతుండడం ఆసక్తిని రేపుతోంది.

తెలుగు డిజిటల్‌ లవర్స్‌ షాక్‌..

యూట్యూబర్ హర్షసాయి చిక్కుల్లో పడ్డాడు. హర్షసాయిపై రేప్ కేసు నమోదవడం తెలుగు డిజిటల్‌ లవర్స్‌ షాక్‌ అయ్యారు. ఇది వరుకే బెట్టింగ్ ప్రమోషన్‌ లాంటి వివాదాల్లో ఇరుక్కున్న హర్షసాయి ఇప్పుడు రేప్‌ కేసులో బుక్కయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రేప్‌ చేసి, వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేశాడని బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నాడని హర్షసాయిపై బాధిత ఆమె ఫిర్యాదు చేసింది. నేరం రుజువైతే హర్షసాయికి కనీసం పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. హర్షసాయి తండ్రి రాధాకృష్ణ కూడా తనను వేధించాడని పోలీసులకు ఆమె కంప్లైంట్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆ అమ్మాయి తనపై కావాలని కంప్లైంట్ ఇచ్చిందంటున్నాడు హర్షసాయి. డబ్బులు కోసమే ఆమె ఇలా చేసిందని ఆరోపిస్తున్నాడు.

 జైల్లో ఊచలు లెక్కబెడుతున్న జానీ మాస్టర్..

మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన కేసులో ఇప్పటికే జానీ మాస్టర్ జైల్లో ఊసలు లెక్కబెడుతున్నాడు. తాను మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తనను లైంగికంగా అనేకసార్లు వేధించాడని సదరు డ్యాన్సర్ కంప్లైంట్ ఇచ్చారు. సినిమాల్లో ఛాన్సులు రాకుండా అడ్డుపడుతున్నాడని కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తనను మతం మార్చుకోవాల్సిందిగా అనేకసార్లు వేధింపులకు గురిచేసినట్టు బాధిత మహిళ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. జానీ మాస్టర్‌ రాజకీయంగా జనసేన పార్టీకి చాలా దగ్గర. దీంతో ఇది రాజకీయంగానూ రచ్చకు దారి తీసింది.

లావణ్య, రాజ్ తరుణ్ గొడవ..

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం నాడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నామని.. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు లావణ్య చెప్పింది. అయితే తర్వాత వేరే మహిళకు రాజ్‌ తరుణ్ దగ్గరయ్యాడని లావణ్య ఫిర్యాదు చేసింది. గత జులైలో ఈ కేసు నమోదవగా.. ఇప్పటికీ ఈ ఇద్దరి ఎపిసోడ్‌పై రచ్చ కొనసాగుతూనే ఉంది.

యూట్యుబర్‌ షణ్ముఖ్ జశ్వంత్‌ సోదరుడి బాగోతం..

స్టార్ యూట్యుబర్‌ షణ్ముఖ్ జశ్వంత్‌ సోదరుడు ఓ అమ్మాయిని నమ్మించి మోసం చేసిన వార్త గత ఫిబ్రవరిలో సంచలనం రేపింది. పోలీసులు ఈ కేసు విషయంలో షణ్ముఖ్ సోదరుడి ఇంటికి వెళితే.. అక్కడ గంజాయి దొరకడం సంచలనం రేపింది. అదే సమయంలో షణ్ముఖ్ కూడా అక్కడే ఉండడంతో నాడు అన్నదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెద్ద తలకాయల కంటే చిన్నతలకాయలే ఎక్కువ..

జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఎక్కువగా ఈ కేసుల్లో చిక్కుకుంటున్న వారిలో పెద్ద తలకాయల కంటే చిన్నతలకాయలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇక టాలీవుడ్‌ అయినా వేరే ఇతర ఇండస్ట్రీ అయినా క్యాస్టింగ్‌ కౌచ్ ఉంటుందన్నది ఎవరైనా అంగీకరించే సత్యమే. అయితే టాలీవుడ్‌ పెద్దలు మాత్రం ఈ విషయంలో మౌనం పాటిస్తుంటారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఒకలాగా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ మరోలా మాట్లాడుతుంటుంది. దొరికినవాళ్లంతా తప్పు చేసినట్టు కాదు.. అలాగని తప్పు చేయనట్టూ కాదు..! నిజం నిలకడ మీద తెలుస్తుంది. అయితే అసలు ఇలాంటివేం లేవు.. ఇండస్ట్రీ అంతా బాగానే ఉందని బుకాయిస్తే మాత్రం పచ్చి అబద్ధమే అవుతుంది.

Also Read :  మూడు సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్‌ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్‌ జోన్‌ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు.

New Update
slbc

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్‌ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్‌ జోన్‌ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ ఇంత వరకు రెండు మృతదేహాలు మాత్రమే దొరికాయి. ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరగగా, 8 మంది అందులో చిక్కుకున్నారు.

Also Read:Sourav Ganguly : పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకోవాలి..  సౌరవ్ గంగూలీ సంచలన కామెంట్స్!

కాలువ లోపల రెస్క్యూ ఆపరేషన్ల పై నిపుణుల కమిటీ, SLBC టన్నెల్ డేంజర్ జోన్‌లో రెస్క్యూ ఆపరేషన్లు, భవిష్యత్ పనులకు ఇన్లెట్ ప్రాంతం ద్వారా సాంప్రదాయ డ్రిల్, బ్లాస్ట్ పద్ధతి తప్ప వేరే మార్గం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.

గురువారం జలసౌధలో జరిగిన అధికారులు, కమిటీ సభ్యుల సమావేశంలో.. సొరంగం 50 మీటర్ల ప్రమాద ప్రాంతంలో రాళ్ల పొరలు, నీరు , ఇతర అంశాల వల్ల సొరంగం మళ్లీ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అనుకుంటున్నారు. దీంతో ఇక్కడ సహాయక చర్యలు మరింత ప్రమాదకరంగా మారాయి.

Also Read: Pak Terror attack: సింధూ బంద్‌తో పాక్ పతనం.. ఇకపై వస్తే వరదలు లేదంటే కరువులు

పర్యావరణ నిబంధనలను పరిశీలించి సిఫార్సులు చేయడానికి అధికారులు ఒక సాంకేతిక ఉపసంఘాన్ని ప్రభుత్వ ఏర్పాటు చేసింది. అనేక జాతీయ సంస్థలతో పాటు, కల్నల్ పరీక్షిత్ మెహ్రా కూడా ఇందులో ఉన్నారు. ప్రస్తుత ప్రమాదం నేపథ్యంలో, తవ్వకానికి ప్రత్యామ్నాయ చర్యలపై సూచనలు అందించే బాధ్యతను దీనికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:Pak Terror attack: సింధూ బంద్‌తో పాక్ పతనం.. ఇకపై వస్తే వరదలు లేదంటే కరువులు

Also Read: BIG BREAKING: పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్.. తగలబడుతోన్న లాహోర్ ఎయిర్పోర్ట్

slbc | tunnel | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment