అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వివాదాన్ని మళ్లీ గెలికిన డైరెక్టర్.. వీడియో వైరల్!

మాజాక టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీరు వివాదస్పదమైంది. మా సెకండ్ హీరోయిన్ అంటూ... కాసేపు ఆగి నీళ్లు తాగి ఆమె పేరు చెప్పారు. ఇది అల్లు అర్జున్ సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి

New Update
Director Trinath Rao Nakkina

Director Trinath Rao Nakkina

టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మజాకా మూవీ టీజర్ రిలీజ్ వేడుక ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేశాడు. మా సెకండ్ హీరోయిన్ పేరు.. పేరు.. అంటూ మర్చిపోయినట్లుగా నటించాడు. కాస్త వాటర్ ఇవ్వండమ్మా అంటూ.. గతంలో అల్లు అర్జున్ స్పీచ్ ను గుర్తుకు తెచ్చాడు. అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ ప్రెస్ మీట్ లో తెలంగాణ సీఎం.. అంటూ కాసేపు ఆగి నీళ్లు తాగిన తర్వాత రేవంత్ రెడ్డి అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం చాలా వివాదస్పదం అయ్యింది.
ఇది కూడా చదవండి: Viral Video: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!

సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎలా మర్చిపోతారంటూ నెటిజెన్లు ఆయనపై ఫైర్ అయ్యారు. ఇది రేవంత్ ఇమేజ్ అటూ ఆయనంటే పడని వారు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ న్ పై ప్రభుత్వానికి కోపం రావడానికి ఇదే కారణమని.. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ జరిగిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన తెలుగు మహాసభల్లో యాంకర్ గా వ్యవహరించిన నటుడు బాలాదిత్య సైతం రేవంత్ పేరును మర్చిపోవడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది.  

ఇలా వరుసగా పేర్లు మర్చిపోవడం వెనుక ఉట్ర ఉందన్న అనుమానాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేశారు. ఆ వివాదం సర్దుమణిగిపోతున్న ఈ సమయంలో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అనవసరంగా అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేసి.. పాత విషయాలు గుర్తుకు తెచ్చాడని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  

హీరోయిన్ పై వల్గర్ కామెంట్స్..

ఇదే వేడుకలో హీరోయిన్ అన్షు అంబానీని ఉద్దేశిస్తూ సైతం త్రినాథరావు వల్గర్ కామెంట్స్ చేశాడు. 'ఒకప్పుడు అన్షు అంబానీ చాలా బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సన్నగా మారిపోయింది. కొంచెం తిని బాగా పెంచమ్మా అని చెప్పాను. తెలుగు వాళ్లకు అవి సరిపోవు. అన్నీ పెద్దవిగా ఉండాలని చెప్పాను' అంటూ కాంట్రవర్సీగా కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment