/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
Today is the first phase of Panchayat elections...Polling is in full swing
Panchayat Elections 2025: రాష్ట్రంలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ రోజు జరగనున్న తొలివిడత ఎన్నికల్లో 3,834 సర్పంచి... 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి...అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఎన్నికైన వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి... ఉపసర్పంచిని ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని... తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి దింపాయి. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ప్రచారం నిర్వహించారు. తొలి దశ ఎన్నికలలో 4,236 గ్రామపంచాయతీ సర్పంచి పదవులకు.... 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. వీటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 396 సర్పంచి పదవులు... 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. మరో వైపు ఒక గ్రామపంచాయతీ సర్పంచి(sarpanch elections 2025 telangana), 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు... 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడుతున్నారు.
Also Read : విశ్వనగరంగా హైదరాబాద్: ఇక అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు
భారులు తీరిన ఓటర్లు
కాగా పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 వరకు ముగియనున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు ఉదయం ఆరుగంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ఓటింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద వేచి చూస్తు్న్నారు.త్వరగా ఓటు వేసి తమ పనులకు తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో పలువురు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. అనుకున్న సమయానికి పలుచోట్ల ఓటింగ్ ప్రారంభం కాగా, కొన్ని ప్రాంతాల్లో సరైన వసతులు లేకపోవడంతో అధికారులు పోలింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
కాగా గ్రామ పంచాయతీఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.‘‘ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీసు ప్లటూన్‌లు, రెండు వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బందితో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదికారులు తెలిపారు. కాగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ఉల్లంఘనపై ఇప్పటివరకు 3,214 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ సెక్షన్ల కింద 31,428 మందిని బైండోవర్ చేశారు. రూ.1,70,58,340 నగదుతో పాటు రూ.2,84,97,631 విలువైన మద్యం, రూ.2,22,91,714 విలువైన మత్తుపదార్థాలు, రూ.12,15,500 విలువైన ఆభరణాలు, మరో రూ.64,15,350 విలువైన సామగ్రి కలిపి మొత్తం రూ.7,54,78,535 సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : కృష్ణారావుపై ఆరోపణలను డాక్యుమెంట్లతో సహా నిరూపిస్తా...జాగృతి కవిత సంచలన కామెంట్స్
మూడో విడతలోనూ ఏకగ్రీవాల హవా
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవల హవా కొనసాగింది. 394 సర్పంచి పదవులు... 7,616 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వివరించింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా... బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలతో జాబితాను ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఏకగ్రీవాలు పోను మిగిలిన 3,752 స్థానాలకు 12,640 మంది బరిలో నిలిచారు. 36,434 వార్డులకు గాను 112 చోట్ల ఎవరూనామినేషన్లు వేయలేదు. 7,916 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది పోటీ పడుతున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Follow Us