Telangana: ఎంతకు తెగించార్రా.. గుడికి వచ్చిన వివాహితపై మాటువేసి గ్యాంగ్‌రేప్‌!

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కోండ మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలస్తోంది. నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మంది యువకులుగా పోలీసులు గుర్తించారు. వీళ్లలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Woman Gang Raped

Woman Gang Raped

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కోండ మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై పలువురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే. ఉర్కొండపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అయితే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన బంధువుతో కలిసి శనివారం మొక్కులు తీర్చుకోవడానికి ఈ ఆలయానికి వచ్చింది. దైవదర్శనం చేసుకున్న తర్వాత రాత్రి అక్కడే ఉండేదుకు సిద్ధమయ్యారు. 

Also Read: సన్నబియ్యం పథకం ప్రారంభం.. కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు జారీ!

ఈ క్రమంలోనే యువతి కాలకృత్యాల కోసం సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ మాటువేసిన కొందరు యువకులు ఆమెను వెంబడించారు. ఆమె వెంట వచ్చిన బంధువుపై కూడా దాడి చేసి చేతులు కట్టేశారు. ఆ తర్వాత బలవంతంగా సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు తెలిసింది. 

Also Read: హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ?

నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులుగా పోలీసులు గుర్తించారు. వీళ్లలో ఆరుగురుని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చరియలు..ఆరుగురు మృతి

 rape | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు