Crime News : రంగారెడ్డి జిల్లాలో క్రేన్‌ కూలటంతో స్పాట్‌లో ముగ్గురు...

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం  మహాలింగాపురం గ్రామ శివార్లలో ఉన్న ncc సిమెంట్ బ్రిక్స్ (ఇటుకల) తయారీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో భారీ సిమెంట్ ఇటుకలను లోడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా క్రేన్ తెగిపడటంతో ముగ్గురు మృతి చెందారు.

New Update
FotoJet - 2026-04-27T183930.128

Three killed on spot after crane collapses in Rangareddy district

Crime News : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం  మహాలింగాపురం గ్రామ శివార్లలో ఉన్న ఒక ప్రముఖ సిమెంట్ బ్రిక్స్ (ఇటుకల) తయారీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో భారీ సిమెంట్ ఇటుకలను లోడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా క్రేన్ తెగిపడటంతో  ప్రమాదం జరిగింది. క్రేన్ అడుగున అప్పటికే పనిలో నిమగ్నమై ఉన్న కార్మికులపై అది పడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఉత్తర భారత దేశానికి  చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.

 ప్రమాద సమయంలో అక్కడ పది మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్రేన్ కూలిన ధాటికి మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.సంఘటనా స్థలానికి శంకర్‌పల్లి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చేపట్టారు.మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు మరియు తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతుల పూర్తి వివరాలు, వారి కుటుంబాలకు సంబంధించిన సమాచారం సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు