ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ ఫొటో పెట్టండి: కాంగ్రెస్ సర్కార్

తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అక్టోబర్ 7వ తేదీలోపు సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోను పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

New Update
REVANTH

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోను పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేర‌కు జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రేవంత్‌ కొత్త ఫొటో నమూనాను కూడా విడుదల చేసింది. ఈ ఫొటోనే ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని ఆదేశించింది. 

Also Read: శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్.. కంపుకొడుతున్న తెలుగు ఇండస్ట్రీ!

ఇప్పటికే కొందరు నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో లేదనే వాదనపై ప్రభుత్వం స్పందించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాయాల్లో సీఎం ఫోటోను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ అక్టోబర్ 7 వరకు గడువు ఇచ్చింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు