/rtv/media/media_files/2025/04/01/GjiKcUFzPALnIg9HezU5.jpg)
HCA vs SRH
SRH vs HCA : టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.
మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంటరీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా సహకరిస్తామని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాలన్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ ప్రకటించాయి.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
A War Of Love: అది కథ కాదు..నా నిజజీవితం...తన సినిమాపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కథ కాదని తన నిజజీవితాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఒక ఫొటో చూసి కనెక్ట్ అయ్యానని చెప్పారు.
Jagga Reddy Movie
A War Of Love: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కథ కాదని తన నిజజీవితాన్ని ఆవిష్కరిస్తున్నానని అన్నారు. మూడు నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఒక ఫొటో చూసి కనెక్ట్ అయ్యానని చెప్పారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని.. టైం ఇస్తారా? అని డైరెక్టర్ అడగ్గానే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టైం ఇవ్వలేనని అనుకున్నానని చెప్పారు.
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
అయితే, ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన తన ఫొటో చూసి ఇది ఖచ్చితంగా తను చేయాలని డిసైడ్ అయ్యానని జగ్గారెడ్డి వెల్లడించారు. 'ఏ వార్ ఆఫ్ లవ్' టైటిల్‌ను డైరెక్టర్ ముందే రాసుకున్నారని తెలిపారు. తన కథకు, లవ్‌కు సంబంధం లేదన్నారు. తన నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని ఆయన చెప్పారు.సినిమా స్టార్ట్ అయినప్పుడు దర్శకుడు ఒక భాగం చెప్పాడని.. మిగితా కథ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నానని జగ్గారెడ్డి తెలిపారు.ఈ సినిమాలో సంగారెడ్డికి చెందిన మొగిలయ్య అనే వ్యక్తి గత18 ఏళ్ల క్రితం రాసిన పాటను ప్రత్యేకంగా విడుదల చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.
ఇది కూడా చూడండి: PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
ఈ చిత్రంలో విద్యార్థి నాయకుడిగా, కౌన్సిలర్‌గా తన పాత్ర ఉంటుందన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎలా మారాడు అనేది చూపించనున్నామని చెప్పారు. తన సినిమా లవ్, ఫ్యాక్షన్, రాజీకీయ అంశాలతో ఆసక్తికరంగా సాగుతుందన్నారు. తాను రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా చేస్తున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని, ఇక సినిమా ద్వారా తన రాజకీయ భవిష్యత్ కు ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని అనుకోవడం లేదన్నారు. ఢిల్లీ పర్యటన తనను పూర్తిగా మార్చేసిందని, ఈ పరిణామాలు ఎటు తీసుకెళ్తాయో తెలియదని అన్నారు. అయితే, తన దృష్టి అంతా సంగారెడ్డి అభివృద్ధిపైనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సంగారెడ్డికి మరిన్ని నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి తన అవసరం అంతగా లేదని అన్నారు.
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?
టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | తెలంగాణ
HCA VS SRH: సద్దుమణిగిన HCA-SRH వివాదం.. ఏం జరిగిందంటే ?
హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని SRH చెప్పింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
LRS : వారికి గుడ్ న్యూస్..ఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పొడిగింపు ?
తెలంగాణలోని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (LRS) ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువు నిన్నటితో (మార్చి 31) ముగిసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
KCR: రంగంలోకి కేసీఆర్.. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశం
ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని కేసీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
Lakshmi Parvathi : తెలంగాణ హైకోర్టులో లక్ష్మీపార్వతికి షాక్.. బసవతారకం ట్రస్ట్ కేసులో కీలక ఆదేశాలు
వైఎస్సార్సీపీ నేత,మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామరావు భార్య నందమూరి లక్ష్మీపార్వతికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు
Gold Rates: తాట తీస్తున్న బంగారం..10 గ్రాములు రూ.94 వేలతో సరికొత్త రికార్డ్
PBK VS LSG: లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు
Life Style: ఈ సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తింటే డేంజర్!