GOOD NEWS: సంక్రాంతికి 6,432 స్పెషల్ బస్సులు..!

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది.

New Update
APSRTC Special Buse Mahakumbh 2025

special buses on Sankranti

సంక్రాంతి రోజులు వచ్చేశాయి. మారు మూల ప్రాంతాల్లో ఉన్న వారు తమ గ్రామాలకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయ్. చిన్నా పెద్దా.. ముసలి ముతక తట్ట బుట్ట సర్దుకుని ఓ వారం పాటు తమ సొంత గ్రామాలకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

6,432 స్పెషల్ బస్సులు

గతేడాది సంక్రాంతి సమయంలో 4,484 స్పెషల్ బస్సులను నడపాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కానీ ప్రయాణికుల రద్దీ కారణంగా 5,246 బస్సులను నడిపింది. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరిన్ని బస్సులను నడపనున్నారు. దాదాపు 6,432 స్పెషల్ బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో దాదాపు 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఏర్పాటు చేసింది. 

Also Read:'గేమ్ ఛేంజర్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

ఈ స్పెషల్ బస్సులను 2025 జనవరి 9 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ బస్సులు హైదరాబాద్‌లోని MGBS, JBS, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, LB నగర్ క్రాస్ రోడ్స్, KPHB, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి సహా మరిన్ని ప్రాంతాల నుంచి బస్సులు బయల్దేరనున్నాయి. 

అయితే ఆంధ్రప్రదేశ్‌కు కూడా స్పెషల్ బస్సులను నడపనుంది. కాకినాడ, అమలాపుం, నర్సాపురం, కందుకూరు, రాజమహేంద్రవరం, పోలవరం, రాజోలు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం, తిరుపతి, విశాఖపట్నం సహా మరిన్ని ప్రాంతాలకు ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. 

అలాగే తిరుగు ప్రయాణం చేసే వారి కోసం కూడా స్పెషల్ బస్సులు నడవనున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో కూడా రిటర్న్ జర్నీ కోసం బస్సులు ఏర్పాటు చేసింది. అయితే స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in లో బుక్ చేసుకోవాలని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440000, 040-23450033 సంప్రదించాలని పేర్కొంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment