TGRTC: గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి ఆ బస్సుల్లో టికెట్ల పై భారీ డిస్కౌంట్‌!

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు‌కు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీ ఆర్టీసీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

author-image
By Bhavana
New Update
bus

TGRTC : ప్రయాణికులను తన వైపునకు తిప్పుకునేందుకు టీజీఎస్‌ ఆర్టీసీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా... అంతకు ముందు నుంచే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ రకరకాల ఆఫర్లు ప్రకటించటంతో పాటు, అవసరమైన మార్గాల్లో ఎక్కువ సేవలు అందించటం లాంటి సౌకర్యాలు కల్పిస్తూ.. ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షిస్తుండేది. కాగా.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. 

Also Read :  TGSRTC: బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలం ఫ్రీ బస్‌పాస్..

మరో తీపికబురు...

అయితే అది కేవలం ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకే పరిమితమవ్వడంతో.. మిగతా బస్సుల్లో మహిళలు, అన్ని బస్సుల్లో పురుషులకు కూడా వివిధ సందర్భాల్లో ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంది టీజీఎస్ ఆర్టీసీ. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌ (Hyderabad) లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) మరో తీపికబురు చెప్పింది.

ఇక నుంచి.. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే పుష్పక్ బస్సు టికెట్ ధరల్లో భారీ డిస్కౌంట్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బస్సుల్లో చాలా మంది ప్రయాణికులు వెళ్తుంటారు. ఆ ప్రయాణికుల కోసం.. ఇక నుంచి పుష్పక్ బస్సుల్లోని టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్‌ కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వివరించింది. 

అయితే.. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి.. ఎయిర్ పోర్ట్‌కు పుష్పక్ బస్సుల్లో ప్రయాణం చేస్తే అలాంటి గ్రూప్‌‍కి అదనంగా మరో 10 శాతం కలిపి మొత్తం 20 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అయితే.. ఈ బంపర్ ఆఫర్ కేవలం సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తింపజేయనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగించుకొని పుష్పక్ బస్సుల్లో క్షేమంగా ఎయిర్ పోర్ట్‌కు చేరుకోవాలని సంస్థ యాజమాన్యం కోరుతోంది. 

ఈ డిస్కౌంట్‌కు సంబంధించిన సమాచారాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ వేదికగా నెటిజన్లకు తెలియజేశారు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ వెళ్లే పుష్పక్ బస్సుల్లో క్యాష్ లెస్ పేమెంట్స్‌ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. అంటే.. డైరెక్టుగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐలతో పేమెంట్ చేసి.. టికెట్ పొందే విధానాన్ని టీజీఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సౌకర్యం.. కేవలం ఎయిర్ పోర్ట్ వెళ్లే పుష్పక్ బస్సుల్లోనే కాదు.. మిగతా మార్గాల్లో సేవలందిస్తోన్న పుష్పక్ బస్సులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు, నాన్ స్టాప్ బస్సుల్లో కూడా అమలు చేస్తుంది.

అయితే.. ఈ విధానంలో చిల్లర సమస్యకు చెక్ పెట్టిన టీజీఎస్ ఆర్టీసీ.. ఇదే విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తోన్న పల్లె వెలుగు బస్సుల్లోనూ అమలు చేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ కృషి చేస్తోంది.

Also Read :  TGSRTC: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పేతో టికెట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment