TGPSC: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో బీసీలు, ఎస్సీలు ఎంతమందో తెలుసా ? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ కేటగిరికి చెందిన వారు క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించింది. బీసీలు 17,291 మంది, ఎస్సీ, 4,828, ఎస్టీలు 2,783, ఓసీలు 3,076, ఈడబ్ల్యూఎస్ 2,774 మంది ఎంపికయ్యారని తెలిపింది. By B Aravind 28 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలో అక్టోబర్ 21న ప్రారంభమైన గ్రూప్ 1 పరీక్షలు.. 27న ప్రశాంతంగా ముగిశాయి. అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ కేటగిరికి చెందిన వారు క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించింది. ఒక్కో పోస్టుకు 1:50 నిష్పత్తిలో గ్రూప్ మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,383 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపింది. వీళ్లలో అత్యధికంగా 17,291 మంది బీసీలు ఉన్నట్లు తెలిపింది. ఎస్సీలు, 4,828, ఎస్టీలు 2,783 మంది క్వాఫిఫై అయినట్లు పేర్కొంది. అలాగే ఓసీలు 3,076 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 2,774 మంది క్వాలిఫై అయ్యారని చెప్పింది. పీడబ్ల్యూడీ కేటగిరిలో మెయిన్స్క్‌కు 1,299 మందిని ఎంపిక చేశారమని వాళ్లని ఆయా కమ్యూనిటీల్లో చూపించామని పేర్కొంది. Also Read: దేశంలో జనగణన.. తెలంగాణ, ఏపీతో పాటు ఆ రాష్ట్రాలకు ఊహించని దెబ్బ ! 21 వేల మంది మాత్రమే హాజరు రాష్ట్రంలో మొత్తం 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 21 నుంచి 27 వరకు వారం రోజుల పాటు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 31, 383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా.. మరో 20 మంది స్పోర్ట్స్ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది. అయితే ఈ మెయిన్స్ పరీక్షలకు కేవలం 21, 093 మంది మాత్రమే (67.17 శాతం) పరీక్షలకు హాజరైనట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ వెల్లడించారు. Also Read : అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్? ఒక్కో పోస్టుకు 37 మందితో పోటీ ఇక ఈ లెక్కన చూస్తే ఒక్క పోస్టుకు 37 మంది మాత్రమే పోటీలో ఉన్నట్లు అయ్యింది. చివరి రోజు ఆదివారం 21,151 మంది పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం, వివిధ కారణాల వల్ల రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. చివరికి ముడోసారి ప్రిలిమ్స్ రాసినా.. ఇటీవల కూడా పరీక్షను వాయిదా వేయాలంటూ నిరసనలు జరిగాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. ఎన్నో వివాదాలు, వాయిదాల వల్ల ఎట్టకేలకు గ్రూప్ 1 పరీక్ష పూర్తయిపోయింది. Also Read: డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు.. ఇదిలాఉండగా.. మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు వివరాలు చీఫ్ సూపరింటెండెంట్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఇచ్చామని కమిషన్ సెక్రటరీ తెలిపారు. చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందన్నారు. మరోవైపు గ్రూప్ 1లో 5 శాతం అన్ రిజర్వ్‌డ్ పోస్టులకు 2,550 మంది అభ్యర్థులతో షార్ట్‌లిస్ట్ చేశామని పేర్కొన్నారు. ఇందులో 182 మంది నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఉన్నట్లు వివరించారు. Also Read : తెలుగు స్టార్ హీరోలపై సూర్య షాకింగ్ కామెంట్స్.. ఒక్కొక్కరి గురించి ఒక్కోలా? #telugu-news #telangana #tgpsc-group-1 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి