Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్ గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ ఆమె 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్ కు ప్రిపేర్ అయింది.

New Update
group-1 deepika

group-1 deepika

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్ గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ ఆమె 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది.  ఉస్మానియా మెడికల్ కాలేజీలో దీపిక MBBS కంప్లీట్ చేసింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్ కు ప్రిపేర్ అయింది.   నాలుగేళ్లపాటు యూపీఎస్సీ, గ్రూప్-1 కోసం సన్నద్ధమయింది.

అమెరికా వెళ్లి మాస్టర్స్‌ చేయాలని  

దీపిక తండ్రి కృష్ణ ఏజీ ఆఫీస్ లో సీనియర్ ఆఫీసర్ గా పనిచేసి రిటైరయ్యారు.  తల్లి పద్మావతి గృహిణి.  వీరికి దీపిక ఒక్కరే సంతానం.. పదో తరగతి వరకూ సఫిల్‌గూడలోని డీఏవీ స్కూల్లో చదివిన లక్ష్మీదీపిక .. 2013లో మెడిసిన్‌  చదవి 119వర్యాంకు సాధించింది. ఆ తరువాత  ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ కంప్లీట్ చేసింది. అమెరికా వెళ్లి మాస్టర్స్‌ చేయాలని అనుకున్నప్పటికీ యూపీఎస్సీ మెరుగైన ఎంపిక అనుకుని అటు వైపుగా సాగింది. 2023లో బయో ఫెర్టిలైజర్స్‌ తయారుచేసే అంకుర సంస్థలో జాబ్ చేసింది.  ఆ తర్వాత ఆ జాబ్‌ మానేసి 2024 జనవరి నుంచి పరీక్షల మీదే పూర్తి దృష్టి పెట్టింది. రోజుకూ 8 గంటల నుంచి 10 గంటల వరకూ చదివేదాన్ననని తెలిపింది.

డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు

గతేడాది సెప్టెంబరులో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబరులో టీజీపీఎస్సీ మెయిన్స్‌ రాశారు దీపిక. ఈ ఏడాది మార్చి 16వ తేదీన యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారు.  దానికి సంబంధించిన ఆ ఫలితాలు రావల్సి ఉంది. ఇంతలో గ్రూప్‌ 1 ఫలితాలు వచ్చాయి. అయితే ఇందులో రాష్ట్రస్థాయిలోనే ఫస్ట్‌ర్యాంకు రావడంతో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు దీపిక ఎంపికయ్యారు. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనుకుంటున్నానని, అందుకే గ్రూప్‌ 1లో చేరాలనుకుంటున్నట్లు దీపిక వెల్లడించారు.  యూపీఎస్సీలో హోమ్‌ క్యాడర్‌ వస్తే అప్పుడు ఏమైనా మార్పులు చేసే విషయంపై ఆలోచిస్తానని అన్నారు.  కాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్‌ ర్యాంకు జాబితా(జీఆర్‌ఎల్‌)ను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇందులో తొలి 10 ర్యాంకుల్లో ఆరుగురు అమ్మాయిలు సత్తా చాటారు.  

Also read :  Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రెండు సార్లు మద్యం బాటిళ్లు కొని అక్కడ మిస్సింగ్ !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు