/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల్యయింది. ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఏటా రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాదికి తొలివిడత పరీక్షకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విద్యాశాఖ అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపించగా.. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పర్మిషన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ విడుదలైంది.
Also Read: హైటెక్ సిటీకి సాంస్కృతిక కళ...మాదాపూర్‌లో మరో రవీంద్ర భారతి..
పరీక్ష విధానం:
పరీక్ష విధానం చూసుకుంటే టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో ప్రాథమిక పాఠశాల (తరగతి 1–5) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్–2లో ఉన్నత ప్రాథమిక పాఠశాల (తరగతి 6–8) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. అయితే అభ్యర్థులు ఒకే పేపర్‌కు లేదంటే రెండు పేపర్లకు అప్లై చేసుకోవచ్చు.
Also Read: ఇక సిలిండర్ అక్కరలేదు..నేరుగా ఇళ్లకే గ్యాస్ పైపులైన్లు.. త్వరలోనే ఆ జిల్లాల్లో షురూ..
Follow Us