/rtv/media/media_files/2025/02/03/JeIXgN6ycLgkNWMH26aI.jpg)
TG EACET, PG ECET Exam Schedule Released
తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్ళల్లో తెలుగు బోధన అమలులో ఉంది. అయితే కొన్ని స్కూళ్ళల్లో పెద్ద తరగతులకు ఇదొక ఆప్షనుగా తీసుకునే అవకాశం ఉంది. తెలుగు ఇష్టం లేదన్న వారు ఫ్రెంచ్ లేదా మరేదైనా ఎంచుకోవచ్చును. అలాగే సీబీఎష్ ఈ, ఐసీఎస్, ఐబీ కరిక్యులమ్ లో టెన్త్ ఎగ్జామ్స్ లో తెలుగు పరీక్ష ఉండదు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటూ వస్తోంది ఇప్పటివరకు.
Also Read : మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే
ఇక మీదట నుంచి తప్పనిసరి...
తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ రూల్ ను మార్చింది. తెలుగు సబ్జెక్ట్ ను అన్ని స్కూళ్ళల్లో తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో దీనిని అమలు చేయాలని ఆదేశించింది. తొమ్మిదవ తరగతి వారికి 2025-26 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి వారికి వచ్చే ఏడాది అంటే 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇక మీదట అన్ని కరిక్యలమ్ విద్యార్థులకూ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ కింద ఉండనుంది. దీని పరీక్ష కూడా ఇక మీదట రాయాల్సి ఉంటుంది.
Also Read : అద్దంకికి ఈసారి పక్కా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే?