/rtv/media/media_files/2025/03/22/fmxCEXxPAIvDG644q6xP.jpg)
Telangana Weather
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎండలు ఎంతలా మండిపోయాయో చూశాం. కానీ ఇప్పుడు ఆ ఎండల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి నుంచి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు జోరుగా వాన కురిసింది. పలు జిల్లాల్లో అయితే వడగండ్ల వాన పడింది. అప్పటి వరకు భగభగమండే ఎండలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. అయితే ఈ వర్షాలు దాదాపు 24వ తేదీ వరకు పడనున్నట్లు వాతావరణ శాఖ ఇది వరకే తెలిపింది.
Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
మరో రెండు గంటల్లో
ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో రెండు గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురవనున్నట్లు సమాచారం. అందులో సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డిలో జిల్లాలో బీభత్సమైన వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పలు జిల్లాల్లో వడగండ్ల వానాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ, ఈశాన్య జిల్లాలో వడగళ్ల వర్షాలు, 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు బీభత్సం సృష్టించబోతున్నాయని సమాచారం. దీంతో 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు.
Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!
(weather | hyderabad weather report | telanagana latest news | latest-telugu-news | telugu-news)