/rtv/media/media_files/2025/02/28/Axo8yhteUPsPB30beTDW.jpg)
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలిపోవడంతో అందులో చిక్కకుపోయిన 8 మందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయచర్యలు మరింత ముమ్మరం చేసింది. బుధవారంతో పోల్చితే గురువారం సహాయ చర్యల్లో వేగం పుంజుకుంది. సొరంగంలో కూరుకుపోయిన మిషన్ ను గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కట్ చేసి ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ పని కోసం ప్లాస్మా కట్టర్లు, హై-గ్రేడ్ షట్టర్లు, శిధిలాల తొలగింపు యంత్రాలను తీసుకువచ్చారు.
రంగంలోకి రైల్వే
సింగరేణి, హైడ్రాతో పాటుగా రైల్వేశాఖ సైతం సహాయ చర్యల్లో పాల్గొంది. సొరంగం నుంచి బురద, రాళ్లు, పైపులు, ఇనుప సామగ్రిని లోకో రైల్ వ్యాగన్లలో నింపి బయటకి పంపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రత్యేక నిపుణులతో రెండు బృందాలను నియమించింది. ఇందులో ఒక బృందం ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకుంది. ప్లాస్మా కట్టర్, బ్రోకో కటింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించి భారీ లోహాలను కత్తిరించడంలో రైల్వేలకు నైపుణ్యం ఉందని దక్షిణ మధ్య రైల్వే (SCR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ శ్రీధర్ తెలిపారు. సహాయచర్యలపై రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షిస్తున్నారు.
చిక్కుకున్న వారిలో జార్ఖండ్‌కు చెందిన మనోజ్ కుమార్ (యూపీ), శ్రీ నివాస్ (యూపీ), సన్నీ సింగ్ (జె అండ్ కె), గురుప్రీత్ సింగ్ (పంజాబ్) మరియు సందీప్ సాహు, జెగ్తా జెస్, సంతోష్ సాహు, అనుజ్ సాహౌగా గుర్తించారు. ఈ ఎనిమిది మంది టన్నెల్ లో చిక్కుకుని ఇప్పటికే ఆరు రోజులు గడిచింది.
మరోవైపు టన్నెల్ కూలిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగం ఇన్‌లెట్ (దోమలపెంట) నుంచి 14వ కి.మీ వద్ద యాడిట్ (టన్నెల్ నుంచి బయటకు వెళ్లే దారి) పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం NRSCకి అప్పగించింది. టన్నెల్‌లో చిక్కుకున్నవారు కచ్చితంగా ఎక్కడ ఉన్నారనే విషయం తెలియగానే ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు.
Also Read : India's GDP: గుడ్‌న్యూస్.. 6.2 శాతం పెరిగిన భారత జీడీపీ..