/rtv/media/media_files/2025/02/26/65FsbZXXrANCMsB0wV1t.jpg)
Telangana suryapeta Photograph: (Telangana suryapeta)
ఈ మధ్యకాలంలో గర్భసంచిలో గడ్డలు(ఫైబ్రాయిడ్స్) సమస్య మహిళలను వేధిస్తుంది. చాలా మందికి గర్భసంచిలో ఈ గడ్డలు ఉన్నాయని కూడా తెలియదు. ఈ గడ్డలు గర్భసంచిలో ఉంటే పొట్ట పెరుగుతుంది. కానీ సాధారణ కొవ్వు అనుకుని కొందరు మహిళలు లైట్ తీసుకుంటారు. చివరకు ఆ గడ్డ పెరిగి ప్రమాదానికి దారితీస్తుంది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో..
ఇటీవల ఇలాంటి ఘటనే సూర్యాపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చివ్వెంల మండలం, పెనుపహాడ్ గ్రామానికి చెందిన కొండమీది అలివేలు గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. గర్భసంచిలో గడ్డ వల్ల పొట్ట కూడా పెరిగిపోయింది. కారణం లేకుండా అనారోగ్య సమస్యలు రావడంతో అలివేలు సూర్యాపేటలోని శ్రీ స్వాతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కి వెళ్లింది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి గర్భసంచిలో 10 కేజీల గడ్డ నిర్దారించారు.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
డాక్టర్ వంశీకృష్ణ జనరల్ సర్జన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందం ఆ గడ్డను తొలగించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో పేషెంట్, వారి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అలివేలు కూడా ఆరోగ్యంగానే ఉంది. పొట్ట పెరగడం వంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఈ గడ్డ పెరిగి చివరకు క్యాన్సర్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య విషయంలో వేరే లక్షణాలు కనిపిస్తే మాత్రం లైట్ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో