MLA Raja Singh : తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింది..ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింద‌ని గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసులు లంచాలు తీసుకోవ‌డంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు రాజాసింగ్ ఒక వీడియో విడుద‌ల చేశారు.

New Update
MLA T.Raja Singh

MLA T.Raja Singh

 MLA Raja Singh : రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింద‌ని గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవ‌డంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు రాజాసింగ్ ఒక వీడియో విడుద‌ల చేశారు.

 రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల‌కు అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, ఏసీపీ లంచాలు తీసుకోవాలంటే భ‌యం ఉండేది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత లంచాల దందా పెరిగింది.ఇటీవల కరీంనగర్‌ జమ్మికుంట పోలీస్‏స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ రూ.3లక్షలు లంచం తీసుకున్నట్లు ఓ బాధితుని ఆడియో వైరల్‌ అయిందని,  ఆ ఇన్‌స్పెక్టర్‌ ఓ కేసులో 3 ల‌క్షలు లంచం తీసుకున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఇన్‌స్పెక్టర్‌ బాత్రూంలో డ‌బ్బులు పెట్టిన‌ట్లు బాధితుడు చెబుతున్నాడు. సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయాల‌ని బాధితుడు ఉన్నతాధికారుల‌ను వేడుకున్నట్లు ఉన్న ఆడియో లీక్‌ అయిందని రాజాసింగ్ తెలిపారు.


తాజాగా తన సొంత నియోజకవర్గమైన గోషామహల్‌  పరిధిలోని సాహినాత్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబూచౌహాన్‌ ఓ కేసులోనిందితుని పేరు తొలగించడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారన్నారు. ఈ ఏడాదిలో చాలా వ‌ర‌కు పోలీసులు లంచాలు తీసుకుంటూ అరెస్టు అవుతున్నారు. లంచం మాఫియాపై సీవీ ఆనంద్ దృష్టి పెట్టాలన్నారు. పోలీసు అధికారులు వారి ఛాంబ‌ర్‌లో కూడా సీసీ కెమెరాలు పెట్టాల‌ని డీజీపీ, సీపీని కోరుతున్నానన్నారు. బాధితులపై అక్రమంగా కేసు పెట్టడం, ఆ తర్వాత  ఆ కేసులో పేరు తీసేసేందుకు డ‌బ్బులు అడ‌గ‌డం చేస్తున్నారని వివరించారు. సాహినాత్‌గంజ్‌ లో అదే జరిగింది. క్రైమ్‌లో లేని వారిని లంచం డిమాండ్‌ చేస్తే నేరం చేయని నేను రూ. 50 వేలు ఎందుకివ్వాల‌ని ఏసీబీకి ఫిర్యాదు చేసిండు. మ‌రి క్రైమ్ చేసిన వారి నుంచి ఎంత డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు..?  అని రాజాసింగ్‌ ప్రశ్నించారు. పోలీసు అధికారులు ఉండే ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాలి. ఇలాంటి ఆఫీస‌ర్లు లంచాలు తీసుకున్నప్పుడు స‌స్పెన్షన్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారని, అలా చేయ‌కుండా, జాబ్ నుంచి పూర్తిగా తొల‌గించాల‌ని, ఇందుకు స్పెష‌ల్‌గా ఒక జీవో తీసుకురావాల‌ని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వీడియోలో రాజాసింగ్ కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు