/rtv/media/media_files/2025/01/28/cLLal6b46m4cUQmEDnOV.jpg)
saraswati
తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తరువాత తొలిసారి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు జరపనున్నట్లు సమాచారం. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని వివిధ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Delhi Burari: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని!
పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ అధికారులు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. సరస్వతీ నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Crime News: నా భార్య కొడుతుంది.. నన్ను క్షమించు నాన్న: భార్య వేధింపులకు మరో భర్త బలి!
అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ సూచించారు. రాష్ట్ర ఏర్పాటయ్యే కంటే ముందు.. 2013లో వచ్చిన సరస్వతి నది పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో గతంలో కంటే మిన్నగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. అత్యంత వైభవోపేతంగా సరస్వతి నది పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
"అంతర్వాహిని"...
సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే "అంతర్వాహిని" గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పుష్కరాల కోసం.. కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు ముహూర్తాన్ని నిర్ణయించి అందుకు సంబంధించిన లేఖను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తుంది.
2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని.. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలను భక్తులు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు తెలిపారు.
మే 15 నుంచి 26 వరకు పుష్కర కాలం ఉండనున్నట్లు వేదపండితులు వివరించారు. ఈ మేరకు పుష్కరాల నిర్వహణ తేదీలను రేవంత్ర రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Also Read: Megha Engineering: మెఘా కంపెనీని బ్యాన్ చేయాలి.. బీఆర్ఎస్ నేతల డిమాండ్