/rtv/media/media_files/2025/04/07/pgSpiFS8z73GD1LZpPbk.jpg)
Telangana RTC
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె జరగనుంది. మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మే నోటీసులు ఇచ్చారు. మే 7వ తేదీన మొదటి తమ మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
Also Read: రేపు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....
కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన అంశాలను నెరవేర్చాలంటూ డిమాండ్. ఇప్పటివరకు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ సమర్పించిన నోటీసుల్లో 21 అంశాలున్నాయి. 2017లో వేతన సవరణ జరిగనప్పటి నుంచి ఇప్పటివరకు ఎరియర్స్ రాలేదని చెప్పారు. ప్రభుత్వం వెంటమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తమకు సరైన గౌరవం లేకపోవడం, వేతనాలు ఆలస్యం చేయడం, ఉద్యోగ భద్రతపై అస్పష్టత లాంటి అనేక సమస్యలతో ఇప్పటికే విసిగిపోయామని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. అందుకే ఈసారి గట్టిగా సమ్మే చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 27నే తమ సమస్యలపై అధికారులకు నోటీసులు ఇచ్చామన్నారు. కానీ ప్రభుత్వం ఏప్రిల్ వచ్చినా కూడా దీనిపై స్పందించలేదని.. అందుకే తాము నిరసన బాట పడుతున్నామని స్పష్టం చేశారు.
Also Read: HCU వివాదం.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్!
rtv-news | rtc | rtc-strike | RTC strike notices