/rtv/media/media_files/2026/05/25/summer-2026-05-25-10-07-12.jpg)
Summer
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. తీవ్రమైన వడగాడ్పులు, ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో.. వడదెబ్బ కారణంగా కేవలం ఒక్క రోజులోనే 58 మంది మృతి చెందారు. గత మూడు రోజుల్లోనే మొత్తం 144 మంది మృత్యువాత పడ్డారు. ఈ వడదెబ్బ మరణాల్లో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఉన్నారు. ఈ జిల్లాలో కేవలం ఒక్క రోజే 20 మంది ఎండ దెబ్బకు చనిపోయారు. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!
తెలంగాణలో మృత్యుఘోష
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 25, 2026
వడదెబ్బతో ఒక్కరోజులో 58 మంది మృతి
అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20 మంది మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16, ఖమ్మంలో 11 మంది మృతి
నల్లగొండలో ఐదు, ఆదిలాబాద్‌లో నలుగురు, సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మృతి
మూడు రోజుల్లో 144 మంది మృత్యువాత pic.twitter.com/vRAop7Ye74
ఇది కూడా చూడండి: ఫల్తా రీపోలింగ్.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!
ఎక్కువ మంది రైతులే..
అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐదుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, సిద్దిపేట జిల్లాలో ఇద్దరు చొప్పున వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు, ఉపాధి హామీ కూలీలు, రైతులు ఉన్నారు. అయితే మరికొన్ని రోజులు రాష్ట్రంలో ఎండ తీవ్రత ఇలానే ఉంటుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని తెలిపారు.
ఇది కూడా చూడండి: Nandamuri Balakrishna: తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ ఫైర్.. నంది అవార్డులపై భారీ ప్రకటన!
Follow Us