TG: కౌశిక్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్న పోలీసులు.. పీడీ యాక్ట్ కేసు, రెండ్రోజుల్లో అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేసిన కౌశిక్ రెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

New Update
koushik reddy

Telangana police PD Act case on BRS MLA Padi Kaushik Reddy

TG News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేసిన కౌశిక్ రెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ ఒపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సోమవారం స్పీకర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. 

Also Read :  గ్యాస్‌ స్టేషన్‌ లో పేలుడు..15 మంది మృతి!

నేతలపై దాడులు, బూతులు..

ఈ మేరకు గత కొంతకాలంగా కౌశిక్ రెడ్డి వివాదాలకు కేఆర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్లు విసురుతూ నానా రచ్చ చేస్తున్న కౌశిక్.. ఇటీవలే అరికెపూడి గాంధీతో వివాదాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను అమ్మనా బూతులు తిట్టాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించడంతోపాటు అంతుచూస్తానని బెదిరించరంటూ సైబరాబాద్‌ అదనపు డీసీపీ రవిచందన్‌ పోలీసులకు అరికెపూడి గాంధీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కౌశిక్‌ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు 132, 351 (2) బీఎన్ఎస్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి.. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి పాల్పడ్డాడు. ఉద్దేశపూర్వకంగానే సంజయ్ ను బూతులు తిడుతూ.. దగ్గరికెళ్లి తోసేశారు. అమ్ముడుపోయిన నా కొడకా అంటూ నొటికొచ్చిన బూతులు తిట్టాడు. దీనిపై కాంగ్రెస్ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Australian Open- Basavareddy: జకోవిచ్‌ను వణికించిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు.. ఎవరు ఈ బసవరెడ్డి!?

కౌశిక్‌ రెడ్డిపై సస్పెన్షన్ వేటు..

ఈ ఘటనలో కౌశిక్‌ రెడ్డిపై 3 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఆర్డివో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ కంప్లైట్ ఇచ్చారు. దీంతో పాడి కౌశిక్‌ రెడ్డిపై బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352,292 కేసులు ఫైట్ చేశారు. మరో ఫిర్యాదుపై కూడా 126 (2),115(2) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే జనవరి 10 విడుదలైన 'గేమ్ చేంజర్' సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ త్రీ టౌన్‌ పీఎస్‌లో మరో ఫిర్యాదు చేయగా కేసులు ఫైల్ చేశారు. మరోవైపు కౌశిక్‌ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి తనను దూషించారంటూ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి కౌశిక్ పై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. ఇలా అనేక సందర్భాల్లో గుండాగిరి చేస్తున్న కౌశిక్ రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు పెట్టి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

పీడీ యాక్ట్‌ అంటే ఏమిటి..


సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్‌ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) కేసు పెడతారు. 6 నెలల వ్యవధిలో ఒకే తరహా నేరాలు 3 కంటే ఎక్కువ చేస్తే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. పీడీ యాక్ట్‌ కేసు నమోదైతే ఏడాది పాటు జైలులో ఊసలు లెక్కబెట్టాల్సిందే. ఈ కేసులో ఏడాదిపాటు బెయిల్ ఉండదు. జైలులో శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చిన వారిపై కూడా పీడీ చట్టం అమలు చేస్తారు. రౌడీలు, గొలుసు దొంగలు, జూదం, నకిలీ విత్తనాల వ్యాపారులు, సైబర్‌ నేరగాళ్లు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ నమోదుచేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలో గత 10 నెలల్లో 2,500కు పైగా పీడీ యాక్ట్ కేసులు నమోదవగా ఈ చట్టం ప్రయోగించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. 

 

ఇది కూడా చదవండి: Urine Health: యూరిన్ వెళ్ళినప్పుడు దుర్వాసన వస్తుందా? ఈ ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం!

 

ఇది కూడా చదవండి: 26 ఏళ్ల సమరసింహారెడ్డి.. బొడ్డు సీన్ కోసం బాలయ్యనే రిజెక్ట్ చేసిన హీరోయిన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు