/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime.jpg)
Nizamabad crime
TG Crime: తల్లిదండ్రులు పిల్లల క్షేమాన్ని కోరుకుంటారు. ఈ రోజులలో తల్లిదండ్రులను ప్రేమను అర్థం చేసుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొందరైతే డబ్బు, ప్రేమ వ్యామోహాలలో పడి తల్లిదండ్రులను కూడా హతరుస్తున్నారు. మరి కొందరైతే.. కుటుంబ వ్యవహారాలలో కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడవలసిన కూతురు తల్లిని కడ తెర్చింది. ఘటన తెలంగాణలో కలకలం రేపింది.
కసాయి కూతురు..
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి కన్నతల్లిని చంపింది ఓ కూతురు. తల్లి వారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆమెపై కక్ష పెంచుకుంది. తల్లి విజయని ఎలాగైనా చంపాలని ఫ్లాన్‌తో.. గాఢ నిద్రలో ఉన్న సమయంలో గొంతు నులిమి చంపేశారు కూతురు సౌందర్య, అల్లుడు రమేష్. అనంతరం.. అనారోగ్యంతో మృతి చెందినట్లు కట్టు కథ చెప్పి అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు. గొంతుపై గాయాలు ఉండటం గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు భార్య భర్తలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: కొబ్బరి పాలు చేసే అద్భుతాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు
తల్లిదండ్రుల విషయంలో ఇలాంటి ఘోరాలు రోజు రోజుకు సమాజంలో పెరిగిపోతున్నాయి. డబ్బు, ప్రేమ, కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకున్నారని చంపటం ఎంతో దారుణం. తల్లిదండ్రులు పిల్లల సంతోషంగా ఉండటం కోసం ఆలోచిస్తారు. రక్తం పంచుకుని పుట్టిన వాళ్లు.. వాళ్లను ఎంతో ప్రేమగా సూచుకోవాలి. కానీ కేవలం డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. తాజాగా.. కన్న తల్లినే హత్య చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.
ఇది కూడా చదవండి: ప్యాక్ చేసినవి తింటే మిమ్మల్ని ప్యాక్ చేయాల్సిందే.. గుర్తుంచుకోండి