![Telangana Kumuram Bheem Kautala mandal 10th class student suicide](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/10/P58Ju5zYJQfrGWglWCo7.jpg)
Telangana Kumuram Bheem Kautala mandal 10th class student suicide
ఫోన్ చూడొద్దమ్మ అని తల్లి మందలించినందుకు పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుమురం భీం జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన 16 ఏళ్ల బాలిక ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది.
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
అయితే కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం నవోదయ ప్రవేశపరీక్షకు హాజరైంది. అనంతరం మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్కూల్‌కి వెళ్లింది. ఇక అక్కడ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆ సమయంలోనే తనకు ఫోన్ కావాలని తల్లిని అడిగింది. స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ జిరాక్స్ తీసుకుంటానని.. తనకు ఫోన్ కావాలని అడిగింది.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
మనస్తాపంతో షాకింగ్ డెసిషన్
కానీ ఆ బాలిక తల్లి మాత్రం ఫోన్ ఇవ్వలేదు. తానే జిరాక్స్ తీసుకొస్తానని చెప్పి.. ఫోన్ పట్టుకుని జిరాక్స్ సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే ఫోన్ అడిగితే ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆ బాలిక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఎప్పుడైతే తన తల్లి బయటకు వెళ్లిందో ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక జిరాక్స్ కోసం వెళ్లిన ఆ బాలిక తల్లి ఇంటికొచ్చి చూసే సరికి వేలాడుతూ కనిపించింది.
Also Read: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి!
దీంతో కన్నీరు పెట్టుకుని సమాచారాన్ని భర్తకు తెలియజేసింది. ఇంటికి చేరుకున్న ఆ భర్త తన కూతురిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దంపతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!