/rtv/media/media_files/2025/04/07/evdWnGKB5oUbNrLtwua1.jpg)
తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’కు హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ గురించి తెలిపారు.
ఇది కూడా చదవండి: Raghunandan: మీనాక్షి నటరాజన్, రేవంత్ కు మధ్య వార్.. ఎంపీ రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ!
It was a pleasure meeting a delegation from Singapore, led by Consul General Edgar Pang, Consul Vaishnavi Vasudevan, First Secretary (Economic) Vivek Raghu Raman, and Denis Tam, Regional Director (India – South) of Enterprise Singapore, among others and discussing exciting… pic.twitter.com/46qbiftz9A
— Sridhar Babu Duddilla (@OffDSB) April 7, 2025
ఆ నగరాల్లోనూ పరిశ్రమలు..
ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ మారుతుందన్నారు. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయకుండా... వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీగా అద్దంకి ప్రమాణ స్వీకారం.. ఆత్మీయంగా అలింగనం చేసుకున్న కోమటిరెడ్డి.. ఫొటోలు వైరల్
టెక్నాలజీ, స్కిల్ డెవలెప్ మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో కాన్సూల్ వైష్ణవి వాసుదేవన్, ఫస్ట్ సెక్రటరీ(ఎకానమిక్) వివేక్ రఘు రామన్, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్(ఇండియా – సౌత్) డేనిస్ టాం తదితరులు పాల్గొన్నారు.
(sridhar-babu | telugu-news | latest-telugu-news | it-jobs)