/rtv/media/media_files/2025/03/03/nbhEkxlXRP8M50I6m4pv.jpg)
Telangana Inter exams students Things must know
తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి5 నుంచి మొదలుకానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రారంభమయ్యే 15నిమిషాల ముందు గేట్లు మూసేస్తారన్న నిబంధనను కచ్చితంగా పాటించడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రానికి 5నిమిషాలు లేటు వచ్చినా పర్వాలేదని పేర్కొన్నారు. ఇక పరీక్షలకు రెండు రోజులే సమయం ఉండటంతో విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చూసేద్దాం.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
ఇవి తప్పక తెలుసుకోండి
విద్యార్థులు పరీక్షలకు ముందు తెగ బట్టీ పట్టి చదివి బుర్రపాడు చేసుకోకూడదు.
ఇప్పటి వరకు ప్రాక్టీస్ అయిన వాటినే మరోసారి చెక్ చేసుకోవాలి.
కొత్త సబ్జెక్ట్‌లను ఇప్పటికిప్పుడు చదవేయాలని అనుకోవద్దు.
ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి.
పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే చెక్ చేసుకోవాలి.
ఎల్లుండి పరీక్ష ప్రారంభం అనగా.. రేపు పరీక్షా సెంటర్‌కు వెళ్లాలి.
ఒకరోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లి మీ రూమ్ నెంబర్, మీ ప్లేస్ చెక్ చేసుకోవాలి.
Also read : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
ఇక పరీక్ష ముందురోజు బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ అని తెగ తినేకూడదు. అలా చేస్తే పొట్ట చెడిపోయే ప్రమాదం
ఉంటుంది. దీంతో పరీక్షకు వెళ్లే సమయంలో గజిబిజిగా ఉండొచ్చు.
పరీక్ష రోజు కూడా తక్కువ ఆహారం తీసుకోవాలి. టిఫిన్ చేసి వెళ్లినా పర్వాలేదు.
ఇక పరీక్ష రోజు తొందర తొందర పడకూడదు. అలా తొందర పడేకొద్ది హాల్ టికెట్ సహా పరీక్షకు కావలసిన పరికరాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలి.
పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందు అంటే 9 గంటలకు పరీక్ష స్టార్ట్ కానుండగా.. 8.30కి పరీక్షా కేంద్రాల వద్ద ఉండాలి.
సెంటర్ లోపలకి వెళ్లిన తర్వాత మళ్లీ రివిజన్ చేసుకోకూడదు. చాలా కూల్‌గా ఉండాలి.
క్వచ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ముందుగా మీకు వచ్చిన.. గుర్తున్న ఆన్సర్లను రాసేయాలి.
ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఒక్కో క్వచ్చన్ ను ఒకటికి రెండు సార్లు చదివితే గుర్తుకు వస్తాయి.