/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
ap rains
TG News: తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, ఉమ్మడి, నిజామాబాద్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కూడన్పల్లి గ్రామ సమీపంలో.. పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో రైతులు, కూలీలు చెట్ల కింద ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు రోజుల వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. క్యుములోనింబన్ మేఘాల ప్రభావం కారణంగా వానలు పడుతున్నట్లు తెలిపింది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వర్షం పడే సూచన ఉంది.
Also Read: మళ్లీ తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్
40 కి మీ నుంచి 50 కి
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఉంటాయి. గంటకు 40 కి మీ నుండి 50 కి. మీ వేగం కలిగిన ఈదురుగాలులు వీస్తాయి. వడగళ్లతో కూడిన వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఉంటాయి. గంటకు 30 నుంచి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో అబ్సిగూడ, బేగంబజార్, నాంపల్లి, సికింద్రాబాద్, బంజారాహిల్స్ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
telugu-news | latest-news | heavy-rains | telangana