భారీ బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్.. యాక్షన్ లోకి 144 సెక్షన్!

తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. టీజీపీఎస్సీ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ లో పరీక్షలను పర్యవేక్షించనున్నారు. 

author-image
By Kusuma
New Update
TSPSC Group-1 Updates: గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్పీఎస్సీ.. విచారణ ఎప్పుడంటే?

తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. పరీక్ష వాయిదా వివాదం నడుస్తున్న వేళ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీ బాంబ్ పేలుడు వెనక ఉగ్ర కుట్ర.. కీలక విషయాలు వెల్లడించిన ఎన్ఐఏ!

ఇప్పటికే పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హజరు కానున్నారు. రాష్ట్రంలో 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగనుండగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరిలో 27 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.  

 

ఇది కూడా చదవండి: యుద్ధానికి సిద్ధమవ్వండి.. జిన్‌పింగ్ సంచలన ప్రకటన

ఇక ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. TGPSC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించరు. 1:30 తర్వాత గేట్ క్లోజ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఎగ్జామ్ జరగనుండగా.. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయించారు. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు!

ఇది కూడా చదవండి: దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం

Advertisment
Advertisment
తాజా కథనాలు