/rtv/media/media_files/2025/04/07/hTZFnPRVno9fBv3GaWaZ.jpg)
Ponguleti Srinivas, batti Vikramarka and Sridhar babu
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. HCU విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిపై ప్రకటన చేశారు. విద్యార్థులపై పోలీసులు ఏ కేసులు నమోదు చేశారో వాటన్నింటిని ఎత్తివేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: రేపు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....
ఇందిలా కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వ్యవహారానికి సంబంధించి HCU విద్యార్థుల నిరసన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అభివృద్ధి పేరుతో భూములను ఆక్రమిస్తే ఊరుకోమని, ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఇటీవల ప్రభుత్వం అక్కడ బుల్డోజర్లతో చెట్లు కొట్టేస్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాళ్లపై కేసులు పెట్టారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకున్నట్లు సోమవారం ప్రకటించింది.
Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇదిలా HCU భూముల వివాదం సుప్రీంకోర్టు వరకు చేరింది. దీనిపై ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మూడు రోజుల్లోనే వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ నిలదీసింది. దీనిపై పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది.
Also Read: HCU వివాదం.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్!
hcu students | batti-vikramarka