EAPCET: తెలంగాణలో ఎంసెట్ రద్దు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ విద్యా కమిషన్ ఒక సంచలన తీపి కబురు అందించింది. ఇకపై ఎంసెట్ (EAPCET) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

New Update
telangana

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ విద్యా కమిషన్(ts-eamcet) ఒక సంచలన తీపి కబురు అందించింది. ఇకపై ఎంసెట్ (EAPCET) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి బదులుగా కేవలం ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతిలో వచ్చే మార్కుల ఆధారంగానే విద్యార్థులకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. 

ప్రస్తుతం ప్రవేశ పరీక్షల వల్ల విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి(Akunuri Murali) స్పష్టం చేశారు. ఈ మేరకు కమిషన్ రూపొందించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి అందజేశారు.

Also Read :  కవితకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీబీఐ!

మార్పులు ఎలా ఉండబోతున్నాయి?

ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఇకపై ఇంటర్మీడియట్‌ను విడిగా కాకుండా, స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే విలీనం చేసి 11, 12వ తరగతులుగా పరిగణించనున్నారు. అంతేకాకుండా, పాస్ మార్కులను కూడా పెంచాలని కమిషన్ కోరింది. స్కూల్, ఇంటర్ స్థాయిల్లో పాస్ మార్కులు 35 నుండి 45 శాతానికి, డిగ్రీ, పీజీ కోర్సుల్లో 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. పీజీ స్థాయి వరకు ఇంగ్లీష్ మీడియంనే కొనసాగించాలని కమిషన్ సిఫార్సు చేసింది. 

టీచర్ల నియామకాల్లో కూడా కీలక మార్పులు సూచించారు. ఇకపై టీచర్ పోస్టుకు డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరి చేయాలని, డీఈడీ కోర్సును పూర్తిగా ఎత్తివేయాలని కోరారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు, బడ్జెట్‌లో విద్యకు 18% నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు. 

మొత్తం మీద ఈ సిఫార్సులు అమలులోకి వస్తే, కేవలం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటర్ చదువుపై దృష్టి పెడితే చాలు ఇంజనీరింగ్ సీటు సాధించవచ్చు. మరోవైపు ప్రైవేట్ కాలేజీల్లో అధిక ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఒక కమిషన్ ఉండాలని సూచించింది.  కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించాలని పేర్కొంది.  

Also Read :  కవిత గారు అంటూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేటీఆర్ సంచలన ట్వీట్ !

Advertisment
తాజా కథనాలు