/rtv/media/media_files/2026/02/12/ts-govt-2026-02-12-20-30-04.jpg)
తెలంగాణలో గవర్నమెంట్(telangana-govt) ఎంప్లాయిస్, టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయిస్(retired-employees) అందరికీ గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కొత్త హెల్త్ స్కీమ్(Health scheme) ను వచ్చే 15 రోజుల్లోనే స్టార్ట్ చేయాలని తెలంగాణ సర్కార్ ఫిక్స్ అయింది. సెక్రటేరియట్లో సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన హెల్త్‌కేర్ ట్రస్ట్ మీటింగ్‌లో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ కొత్త స్కీమ్ ప్రకారం, ఎంప్లాయిస్ తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం అమౌంట్‌ను హెల్త్ స్కీమ్ కోసం కంట్రిబ్యూట్ చేయాలి. ఎంప్లాయిస్ ఎంత కడతారో, ప్రభుత్వం కూడా అంతే అమౌంట్‌ను తన వాటాగా ఇస్తుంది. దీనివల్ల ఎంప్లాయిస్ నుంచి ఒక రూ.528 కోట్లు, గవర్నమెంట్ నుంచి మరో రూ.528 కోట్లు.. ఇలా ఏడాదికి మొత్తం రూ.1,056 కోట్లు ఈ ట్రస్ట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ డబ్బుతోనే ఎంప్లాయిస్‌కు కార్పొరేట్ లెవల్ ట్రీట్మెంట్ అందిస్తారు.
Also Read : తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి : సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
12.84 లక్షల మందికి బెన్ ఫిట్
రాష్ట్రంలో ఉన్న 1.44 లక్షల మంది ఎంప్లాయిస్, రిటైర్డ్ ఎంప్లాయిస్‌తో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ (మొత్తం 12.84 లక్షల మంది) ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందుతారు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కోసం ఇప్పటికే 515 హాస్పిటల్స్‌ను అధికారులు సెలెక్ట్ చేశారు. ఒకవేళ పొరుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తే, అక్కడ కూడా ఈ ఈహెచ్ఎస్ (EHS) వర్తించేలా రూల్స్ రెడీ చేస్తున్నారు.
గురుకులాలు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి కూడా ఈ స్కీమ్ ఇవ్వాలని యూనియన్లు అడగ్గా.. ట్రస్ట్ ఏర్పడ్డాక దానిపై నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పారు. మొత్తానికి వచ్చే నెల (మార్చి) నుంచి ఈ కొత్త హెల్త్ కార్డుల సేవలు ఎంప్లాయిస్‌కు అందుబాటులోకి రానున్నాయి.
Also Read : మహానగరం మూడు కార్పొరేషన్లు.. మీ ఏరియా ఇప్పుడు ఏ కార్పొరేషన్లో ఉందంటే?
Follow Us