Caste Census: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చనున్నారు. 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
Telangana

Telangana Caste Census: తెలంగాణలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చనున్నారు. అలాగే వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల వివారలను సైతం సర్కర్.. సేకరించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టబోయే కులగణనకు అవసరమైన ప్రొఫార్మాను బీసీ కమిషన్ రూపొందించింది. దాదాపు 54-60 ప్రశ్నలతో ఉన్న ప్రశ్నావళిని సిద్ధం చేసింది. అయితే ఎప్పటినుంచి కులగణనను చేపట్టాలనే షెడ్యూల్‌ను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. 

Also Read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!

10-15 రోజుల్లో పూర్తి

ఈ షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో కులగణన చేపట్టి పూర్తి వివరాలు సేకరించనున్నారు. కేవలం 10-15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను ఇలా త్వరగా ముగించేందుకు దాదాపు 80 వేల మంది ఎన్యుమరేటర్లు. 10 వేలమంది సూపర్‌వైజర్లు అవసరమవుతాని బీసీ కమిషన్ అంచనా వేసింది. కానీ ఇంత పెద్దమొత్తంలో కమిషన్‌కు సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఈ బాధ్యతను రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రణాళిక విభాగానికి అప్పగించింది. 

Also Read: గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు

దీంతో కులగణన చేపట్టేందుకు అవసరమైన సిబ్బందిని అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి తీసుకోవాలని ప్రణాళిక విభాగం నిర్ణయం తీసుకుంది. గణన షెడ్యూల్, ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసిన అనంతరం సిబ్బందిని విభాగాల వారీగా తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్లకి హైదరాబాద్‌లో మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మస్టర్ ట్రైనింగ్ తీసుకున్నవాళ్లు జిల్లాల్లోని సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఒక్క రోజులోనే పూర్తి చేయనున్నారు. 

Also Read: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం. రేవంత్ సంచలన వ్యూహం!

రూ.150 కోట్లు కేటాయింపు

 మొత్తంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కులగణన ప్రారంభమయ్యాక 10-15 రోజుల్లోనే వివరాల సేకరణ పూర్తి చేస్తారు. ఆ తర్వాత మరో 10-15 రోజుల్లో సేకరించిన వివరాలను కంప్యూటర్‌లో పొందుపరుస్తారు. ఆ వివరాలను బీసీ కమిషన్ పరిశీలిస్తుంది. వాటిని క్రోడీకరించి స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్‌లను సూచిస్తూ ప్రభుత్వానికి రిపోర్టును సమర్పిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రక్రియ 60 రోజుల్లో ముగుస్తుంది. ఈ కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది.  

Also Read: పైసా పనిలేదు.. రాష్ట్రానికి లాభం లేదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

అయితే ప్రభుత్వం నిర్వహించబోయే.. కులగణనలో కులాలతో సహా వ్యక్తులు, వాళ్ల ఆర్థిక పరిస్థితులు, వృత్తి, ఆదాయం వంటి వివరాలన్నీ కూడా ప్రశ్నావళిలో నమోదు చేయనున్నారు. ముఖ్యంగా ఆయా కుటుంబాల్లో రాజకీయ ప్రాతనిధ్యం ఏదైనా ఉందా? గతంలో ఎవరైనా రాజకీయ పదవుల్లో ఉన్నారా ? అనే వివరాలన్నీ కూడా సేకరించనున్నారు. ఈ మొత్తం వివరాలను మాన్యువల్‌గా సేకరించి ఏ రోజుకు ఆరోజే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. జిల్లాల కలెక్టర్లు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. మొత్తానికి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు