/rtv/media/media_files/2026/04/24/tgsrtc-2026-04-24-18-01-08.jpg)
TGSRTC
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ నేతల్లో జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. చర్చల్లో కొన్ని డిమాండ్లకు రేవంత్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. కారుణ్య నియామకాలకు సంబంధించి పర్మినెంట్ పద్ధతిలో వేతనాలు చెల్లించేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే గుర్తింపు ఎన్నికలు, పీఆర్సీ అంశాలు తలెత్తవని అధికారులు భావిస్తున్నారు.
Also Read: నర్సంపేటలో హైటెన్షన్.. రోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం
ఇదిలాఉండగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో మూడో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మేను ఆపేది లేదని కార్మికులు తేల్చి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ సిబ్బంది దాదాపు 10 వేల బస్సులను నిలిపివేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నిరసనలు చేస్తున్నారు. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన RTC డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్న సంగతి తెలిసిందే. బాధితుడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
Also Read: బీజేపీలో చేరిక.. RTVకి మల్లారెడ్డి కోడలు సంచలన ఇంటర్వ్యూ!
దీంతో ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మే మరింత అగ్గి రాజుకుంది. కార్మికుల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని.. తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీతో సచివాలయంలో మీటింగ్ జరిగింది. చివరికి ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం, కారుణ్య నియామకాలకు సంబంధించిన వేతనలతో పాటు పలు డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Follow Us