రేవంత్ సర్కార్ సరికొత్త ప్లాన్.. ఆ తేదీ నుంచి కట్టిన బిల్డింగ్స్ కూల్చుడే

నగరంలో పర్మిషన్లు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై రేవంత్ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సరికొత్త ప్లాన్ వేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Revanth hydra

నగరంలో పర్మిషన్లు లేకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్న భవనాలపై రేవంత్ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సరికొత్త ప్లాన్ వేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదిని ప్రాతిపదికగా తీసుకొని.. ఈ తేదీ చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల విషయంలో ఈ రూల్స్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రతిపాదనలను పంపిందని.. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నారు.    

Also Read: వచ్చే ఏడాదికి అది పూర్తి.. 3 వేల మందికి ఉపాధి: కిషన్ రెడ్డి

310 నిర్మాణాలు కూల్చిన హైడ్రా

ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమించుకొని నిర్మాణాలను చేపట్టిన వాటిపై హైడ్రా ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హైడ్రా 310 కట్టడాలను కూల్చివేసింది. 114 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. కొన్నేళ్లుగా ఈ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు వీటిని తప్పుడు దారిలో పర్మిషన్లు తీసుకొని ఇళ్లు నిర్మించారు. మరికొందరు అసలు ఎలాంటి పర్మిషన్లు లేకుండానే నివాసాలు కట్టేశారు. ఆ తర్వాత వీటిని వేరేవాళ్లకు విక్రయించారు. 

వాళ్ల జోలికి వెళ్లం

అయితే అక్రమంగా నిర్మించడం వల్ల వాటిలో నివాసం ఉంటున్నవారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ప్రజలు నివాసముంటున్న ఇళ్లు కూల్చమని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో చాలావరకు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. గత ఐదేళ్లలో ఓఆర్ఆర్ లోపల 20 చెరువులు పూర్తిగా కబ్జా కాగా.. 24 పాక్షికంగా కబ్జా అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 

Also Read: తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలో పనులు షురూ!

వీటిని కూల్చే క్రమంలోనే ఆ అక్రమ నివాసాలను కొనుగోలు చేసి అందులో ఉంటున్నవారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అందుకే వాటిని పక్కనబెట్టి కొత్తగా ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినా లేదా పర్మిషన్లు లేకుండా కట్టడాలు నిర్మించినా వెంటనే గుర్తించి కూల్చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 అక్టోబర్ 1 తర్వాత అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చేసారు. అక్టోబర్ 1 కన్నా ముందు నిర్మించిన భవనాలు ప్రస్తుతానికి సురక్షితమే అని తెలుస్తోంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనల మేరకు.. త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని తెలుస్తోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు