/rtv/media/media_files/2025/04/10/qWnfuxjs6nih4ipfSOfV.jpg)
Jishnu Dev Varma
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుకు మరో ముందుడుగు పడింది. ఈ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గంలో 3 గ్రూపులుగా ఉప కులాలను విభజించి 15 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లు రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ బిల్లుకు చట్టబద్ధత ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. దీంతో మంగళవారం జిష్ణుదేవ్ వర్మ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే రేవంత్ ప్రభుత్వం త్వరలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!
గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒక్కో అడుగు ముందుకెస్తున్న రేవంత్ ప్రభుత్వానికి గవర్నర్ నుంచి కూడా ఆమోదం లభించింది. దీనివల్ల ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది. గతేడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీరణకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో అదే రోజున సీఎం రేవంత్ దీనిపై స్పందించారు. వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు.
దీంతో 2024 సెప్టెంబర్ 12న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ఉప సంఘాన్ని నియమించారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని ఉపసంఘం సిఫార్సు చేసింది. దీనిపై విస్తృత అధ్యయనం పూర్తయ్యాక ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేబినెట్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి.
Also Read: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి
sc-classification | telugu-news