/rtv/media/media_files/2025/03/28/sshA0l7NCucO7Hec1P5s.jpg)
cm revanth reddy 0000 Photograph: (cm revanth reddy 0000)
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందాక కూడా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపాలని రేవంత్‌రెడ్డి సర్కారు నిర్ణయించుకుంది. ఇలా తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వారు ఏకంగా 6,729 మంది ఉన్నారు. వారిని కొలువులో నుంచి తీసేసి.. ఆ స్థానంలో సర్వీస్‌లో ఉన్నవారిని నియమించుకోవాలని ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే లిస్ట్‌లో మెట్రోరైల్ ఎండీ NVS రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్‌ఎన్ రెడ్డి.. పది మంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు.
Also read: AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మంది ఎయిడ్స్
తొలగించిన వారిలో ఎవరి సర్వీస్ అయినా అత్యవసరం అని భావిస్తే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలిపారు. ఈ నిర్ణయంతో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ వాటర్‌వర్క్స్, మెట్రోరైల్, రెరా, మెప్మా, కుడా, వైటీడీఏ.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ IASలు, RDOలు, DFOలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు వివిధ క్యాడర్లకు చెందిన పలువురు అధికారులున్నారు.
Also read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి