Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. ప్రభుత్వం కేటాయించిన ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ గృహాలకు సంబంధించిన ఇనుము, సిమెంటు తదితర సామాగ్రిని కూడా తక్కువ ధరకే ఇప్పించేలా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక సొంత స్థలం ఉంటే రూ.5 లక్షలు, స్థలం లేని వారికి భూమితోపాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. లబ్ధిదారులకు భారం కాకుండా.. అయితే ప్రస్తుతం ఇంటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో లబ్ధిదారులకు భారం కాకుండా సామాగ్రిని తక్కువ ధరకే సమకూర్చేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక ఇంటికి 40 టన్నుల ఇసుక అవసరం అవుతుందని.. మొత్తం 4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలని అంచనా వేస్తున్నారు. ఇక ఇసుకను ఉచితంగా అందించడంకోసం ఖనిజాభివృద్ధి సంస్థతో ప్రభుత్వం చర్చిస్తోంది. ఇసుక ఎక్కడ లభిస్తోంది.. ఎంత ధర పలుకుతోందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఇది కూడా చదవండి: Gambir: డ్రెస్సింగ్ రూమ్లో లొల్లి..అతన్ని పొట్టుపొట్టు తిట్టిన గంభీర్ టన్నుకు రూ.2400.. ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.1400 నుంచి రూ.1500 పలుకుతుండగా ఇందులోనూ రకాన్నిబట్టి ఉన్నాయి. ఖమ్మంలో టన్ను రూ.1400 ఉంటే.. హైదరాబాద్లో రూ.1700 డిమాండ్ ఉంది. కొన్నిసార్లు టన్నుకు రూ.2400 పలుకుతోంది. దీని ప్రకారం ఒక ఇంటికి 40 టన్నుల ఇసుకకు రూ.1500 చొప్పున ప్రభుత్వం రూ.60 వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఉచిత ఇసుకలో అవకతవకలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ లకు ఇసుకను ఉచితంగా ఇచ్చింది. కానీ ఆ ఇసుకను బ్లాక్లో విక్రయించడంపై విమర్శలు వచ్చాయి.