Meenakshi Natarajan: మాట వినకుంటే వేటు తప్పదు.. ఆ నేతలకు మీనాక్షి సీరియస్ వార్నింగ్!

తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పార్టీ నేతలకు మరోసారి కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవద్దని అన్నారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

New Update
Meenakshi Natarajan

Meenakshi Natarajan

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్‌ తన చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సెగ్మెంట్ల వారీగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఈ మేరకు మంగళవారం మెదక్ పార్లమెంట్ నేతలతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా పార్టీ నేతలకు మరోసారి కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవద్దని అన్నారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పార్టీ అంతర్గత విషయాలు కూడా బయట మాట్లాడితే వేటు తప్పదన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటుంన్నానని చెప్పారు. 

Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నియోజకవర్గ ఇంఛార్జీలు బాధ్యతతో పనిచేయాలన్న సూచించారు. ఇంఛార్జి వల్ల ఏదైనా సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అయితే పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని పార్టీ నేత శ్రీనివాస్ గౌడ్ మీనాక్షితో  అన్నారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. అధికారులు తమ మాట వినడం లేదని మరి కొందరు నేతలు చెప్పారు. ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తాన్నారని పలువురు నేతలు వివరించారు. కనీసం ఇందిరమ్మ ఇళ్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందని తెలిపారు. 

Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

మరోవైపు మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కావాలంటే పదేళ్లు పనిచేసి ఉండాలన్నారు. పార్టీలో చేరిన కొత్తవాళ్లను కలుపుకుంటామన్నారు. అలాగే పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్‌లోనే చెప్పాలని.. గాంధీ భవన్‌ బయట మాట్లాడొద్దన్నారు. మంత్రులు తప్పొప్పులు కూడా మీటింగ్‌లోనే చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటూ సోషల్ మీడియాలో పెట్టడం, ప్రత్యేక సమావేశాలు పెట్టడం లాంటివి చేయొద్దన్నారు. ఎవరైనా రూల్స్‌ ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Also Read: కొడుకు ఇంటర్ పరీక్ష రోజున తల్లి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఘటన

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు