BIG BREAKING: కీలక బిల్లులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Telangana Cabinet approves several key bills

Telangana Cabinet approves several key bills

సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మత సామరస్యాన్ని కాపాడేందుకు, సోషల్ మీడియాలో, విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే పోస్టులు నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026' ను ఆమోదించింది. మతాల మధ్య గొడవలు జరగకుండా అడ్డుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. 

గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్ 

రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు ఉన్నారు. వీళ్ల కోసం ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026’ ను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. గిగ్‌ వర్కర్ల రిజిస్ట్రేషన్‌తో పాటు ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నారు. వీళ్లకు చట్టబద్ధమైన గుర్తింపుతో సహా సామాజిక భద్రత లభించనుంది. 

ప్రభుత్వం చేతికి మెట్రో రైలు

హైదరాబాద్‌లో ఫేజ్ 1 మెట్రో సిస్టమ్‌ను ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనె చేసుకోనుంది. దీనికోసం రూ.15 వేల కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (HMRL)ను నోడల్ ఏజెన్సీగా నియామకం చేసింది. 

తల్లిదండ్రులకు సపోర్ట్

రేవంత్ సర్కార్‌ మానవీయ కోణంలో కీలక బిల్లును తీసుకొచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు బాధ్యత తీసుకొని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, అలాగే ప్రజాప్రతినిధుల వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు (ఏది తక్కువగా ఉంటే అది) కట్‌ చేస్తారు. ఈ డబ్బులను నేరుగా ఆ తల్లిదండ్రులకే అందజేస్తారు. 

న్యాయవాదులకు రక్షణ 

న్యాయవాదులపై జరుగుతున్న దాడులు నియంత్రించేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. వామనరావు దంపతుల హత్య లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా న్యాయవాదులకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంది. 

రోహిత్ వేముల చట్టం

ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన సర్వేపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టును మంత్రివర్గం పరిశీలించింది. విద్యాసంస్థల్లో కుల వివక్షను నిర్మూలించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 

Advertisment
తాజా కథనాలు