మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు ప్రతిమ శ్రీనివాస్ రావు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు. మొన్నటి వరకు కేసీఆర్‌తో క్లోజ్‌గా ఉన్న శ్రీనివాస రావుకు, సీఎం రేవంత్‌కి మధ్య స్నేహం పెరుగుతుందా? ఎప్పుడు ఉప్పు, నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు తక్కువగానే ఉంటాయి. దీంతో వీరికి సన్నిహితంగా ఉన్న వారి మధ్య కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే తాజాగా ప్రతిమ శ్రీనివాస రావు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: TG: డమ్మీ చెక్కులిస్తున్న సీఎం రేవంత్.. హరీష్ రావు సంచలన ఆరోపణలు!
హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు స్వీయ చరిత్ర ఉనిక పుస్తకావిష్కరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు సభాధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రతిమ శ్రీనివాస్‌రావు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరు క్లోజ్ అవడం వెనుక కారణాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది.
ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్ బంధువు హోటల్‌పై పోలీసుల దాడి.. 35 మంది ఒకేసారి!
శ్రీనివాస్ రావు కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ, ప్రతిమ హోటల్స్, ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపనీస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన విద్యాసాగర్ రావుకు మేనల్లుడు. ఈయన సోదరుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇదే టైంలో శ్రీనివాస రావు కూడా కేసీఆర్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్‌ను ప్రతిమ శ్రీనివాస రావు పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
భూకబ్జా ఆరోపణలు..
శ్రీనివాస రావుపై హైదరాబాద్ పక్కనే ఉన్న తెల్లాపూర్‌లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కబ్జా ఆరోపణలపై గతంలో స్థానికులు ధర్నాలు కూడా చేపట్టారు. అయితే ఆయనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌తో శ్రీనివాస రావు సన్నిహితంగా ఉండటం చర్చనీయాంశం అయింది. ఎన్నడూ లేని విధంగా ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తోందని, అందుకు పుస్కకావిష్కరణ సభను వినియోగించుకున్నారనే చర్చ నడుస్తోంది.